విజయవాడ బస్సు ప్రమాదంపై కమిటీ విచారణ

విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.ఈ మేరకు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోంది.

ఘటనపై ఇప్పటికే బస్ డ్రైవర్ ను కమిటీ విచారించింది.ఈ క్రమంలోనే విచారణ అనంతరం ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వనుంది.

కాగా ప్రమాదానికి సంబంధించి సీసీ టీవీ దృశ్యాలను కమిటీ పరిగణనలోకి తీసుకోగా.టెక్నికల్ టీమ్ బస్సు పరిస్థితిని పరీక్షించింది.

అయితే కమిటీ నివేదిక ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.కాగా విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ముగ్గురు మృత్యువాత పడటంతో పాటు పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు