చికిత్స కోసం స్వయంగా మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన కోతి.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.అప్పుడప్పుడు కోతుల చేష్టలు నెటిజన్లను ఆకర్షిస్తాయి.

అవి మనుషులను అనుకరించడం, తెలివిగా ప్రవర్తించడం తరచుగా చూసే దృశ్యాలే.మనుషుల బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి వాటి సరదా పనులతో నవ్విస్తుంటాయి.

అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కోతి( Monkey ) సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సాధారణంగా కోతులు గుంపులుగా జీవిస్తాయి.

కొన్నిసార్లు మానవ నివాసాల్లోకి వచ్చి ఆహారం వెతుకుతాయి.కానీ ఈసారి ఓ కోతి నేరుగా ఓ మెడికల్ షాప్( Medical Shop ) లోకి వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Injured Monkey Rushes To Pharmacy Video Viral Details, Monkey Viral Video, Bang
Advertisement
Injured Monkey Rushes To Pharmacy Video Viral Details, Monkey Viral Video, Bang

ఈ అరుదైన సంఘటన బంగ్లాదేశ్‌లోని( Bangladesh ) మెహెర్‌పూర్‌లో చోటుచేసుకుంది.అక్కడ ఓ కోతి దాని గాయానికి చికిత్స చేయించుకోవడానికి నేరుగా మెడికల్ షాపుకు వెళ్లింది.అక్కడ ఉన్న వ్యక్తికి తాను ఎక్కడ గాయపడిందో తెలియజేయడానికి ప్రయత్నించింది.

ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలను ఆశ్చర్యపరిచింది.ఆ కోతికి సహాయం చేయడానికి స్థానికులు ముందుకొచ్చారు.

వారిలో ఒకరు కోతికి చికిత్స అందించి, గాయానికి కట్టు కట్టారు.

Injured Monkey Rushes To Pharmacy Video Viral Details, Monkey Viral Video, Bang

ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీనితో, అది వేగంగా వైరల్‌గా మారింది.వేలాది మంది ఈ వీడియోపై స్పందించి మానవత్వం ఇంకా బతికే ఉందని వ్యాఖ్యానించారు.మరికొందరు ఈ కోతి చాలా తెలివైనదని కామెంట్ చేస్తున్నారు.

రాజమౌళి సినిమా కోసం అడవుల్లో అడ్వెంచర్స్ చేస్తున్న మహేష్ బాబు...
గుంజీలు తీసి, దండం పెట్టిన ఉపాధ్యాయుడు.. ఎందుకంటే?

ఈ ఘటన కోతుల తెలివితేటలు, వాటి అనుభవ సామర్థ్యాన్ని మరోసారి నెమరు వేసేలా చేసింది.మానవాళికి సహజంగా ఉండే బాధ్యతాయుతమైన సహాయస్ఫూర్తిని గుర్తు చేసింది.

Advertisement

ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు