అవకాశాల కోసం ఎలాంటి తప్పు చేయక్కర్లేదు: ఇంద్రజ

ఆడవారిపై వేధింపులు అనే మాట కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ కి లేదంటే టీవీ ఇండస్ట్రీ కి పరిమితం అయ్యింది కాదు.

ప్రతి చోట ఇది ఉంటూనే ఉంటుంది.

ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కఠినమైన నిజం.అన్ని రంగాల్లో ఈ వేధింపుల తీవ్రత దారుణంగా మారుతుంది.

చదువుకున్న వారు కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.తమతో పని చేసేవారిని లోబర్చుకోవడం, తమ కింద పని చేస్తున్న వారితో డబల్ మీనింగ్ డైలాగ్స్ తో వేధింపులకు గురి చేయడం జరుగుతూనే ఉంది.

అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఇది మరి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా చాల వాస్తవం.సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీ కి వస్తున్న వారిని నయానా భయాన్నో ఒప్పించి తమ కోర్కెలు తీర్చుకుంటూ వారికి కనీసం అవకాశాలు సైతం ఇవ్వడం లేదు.

Advertisement
Indraja About Casting Couch In Industry , Indraja, Glamor Field, Star Heroines,

ఆలా ఎన్ని కష్టాలకు ఓర్చుకొని సినిమాల్లో నిలదొక్కుకుంటున్నారు.ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ చలామణి అవుతున్న చాల మంది ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వారే అంటే అతిశయోక్తి కాదు.

కాని బయటకు ఎవరు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు.కొందరు బాహాటంగా ఈ విషయం పై నిప్పులు కక్కుతుంటే కొందరు సర్దుకుపోతున్నారు.

ఇక ఈ విషయం పై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సీనియర్ హీరోయిన్ అయినా ఇంద్రజ మాట్లాడారు.ప్రస్తుతం బుల్లి తెరపై జడ్జ్ గా సందడి చేస్తున్న ఇంద్రజ తనదైన ముద్ర వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం రోజా స్థానంలో జబర్దస్త్ కి జడ్జ్ గా వ్యవహరించిన ఆమె రోజా రీఎంట్రీ తో షో నుంచి తప్పుకున్నారు.సోషల్ మీడియాలో కొందరు తమకు ఇంద్రజ కావాలంటూ కామెంట్స్ చేయడం విశేషం.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఇక ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షో కి పెర్మనెంయ్ జడ్జ్ గా ఇంద్రజాను తీసుకోవడం గమనార్హం.

Indraja About Casting Couch In Industry , Indraja, Glamor Field, Star Heroines,
Advertisement

ఇంద్రజ మాట్లాడుతూ, ఆడవారిపై వేధింపులు ప్రతి చోట ఉన్నాయని, ఇందుకు సినిమా ఇండస్ట్రీ ఏమి మినహాయింపు కాదని, కాని ఎవరైతే తమ ముందు ఉన్న సమస్యను దైర్యంగా ఎదుర్కొంటారో వారే విజయం సాధిస్తారని తెలిపారు.ఇక అవకాశాల కోసం మనసు చంపుకొని మరి పని చేయక్కర్లేదని, కష్టపడితే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయని స్ప్రష్టం చేసారు.

తాజా వార్తలు