Indraja Daughter: హీరోయిన్ ఇంద్రజ కూతురిని చూసారా.. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదుగా?

తెలుగు సినీ నటి, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ( Heroine Indraja ) గురించి మనందరికీ తెలిసిందే.

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ, అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది.

కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు మధ్యమధ్యలో తనదైన శైలిలో కూడా పంచులు వేస్తూ, డాన్స్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఇంద్రజ.

కాగా ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ లో ( Jabardasth ) రోజా ప్లేస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అలాగే వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రలో నటిస్తూ మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తోంది.

Advertisement

నటి ఇంద్రజ ఒక డాన్సర్ ( Dancer ) అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.శాస్త్రీయ నాట్యంలో చిన్న‌ప్పుడే శిక్షణ తీసుకుంది.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది.

మొదటి నుంచి తనకు సంగీతం,డ్యాన్స్ అంటే తనకి ప్రాణమని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇంద్రజ కూతురు( Indraja Daughter ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంద్రజ కూతురు పేరు సారా.( Sara ) ఆమె ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటోంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంద్రజ తన కూతురు గురించి నా కూతురిలో నటి కన్నా, మ్యూజిక్ లవర్ కనిపిస్తుంది.

భవిష్యత్ లో ఆమె మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) అవుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది.దీంతో అభిమానులు మీలానే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

హీరోయిన్ గా ట్రై చేసినా ఛాన్సులు వస్తాయని కానీ , ఆమెకు నచ్చిన రంగంలో కొనసాగితే అది ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.కొంతమంది ఆమె చాలా అందంగా ఉంది హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోవడం లేదు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ హీరోయిన్గా రాణిస్తే మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు