5 లక్షల మంది నిర్మాతలతో రూపొందించబడ్డ ఏకైక సినిమా ఇదే !

ఏదైనా సినిమా వస్తుంది అంటే దానికి ఎంత మంది నిర్మాతలు ఉంటారు మహా అయితే ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు.

లేదంటే ఈ మధ్యకాలంలో కాస్త హడావిడి మరోరకంగా కూడా కనిపిస్తుంది మూడు నాలుగు సంస్థలు కలిపి పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాయి.

అందువల్ల ఏ ఒక్కరూ కూడా పెద్ద బడ్జెట్ చిత్రం ఫ్లాప్ అయినా కూడా మరికొన్ని సినిమాలు తీయడానికి సరిపడా బడ్జెట్లో వారి దగ్గర ఉంటాయి కాబట్టి.ఒక నిర్మాతగా కోట్ల రూపాయలు కోల్పోవడం కన్నా ఇలా నలుగురు కలిపి సినిమా తీయడం వల్ల కాస్త నష్టం తక్కువగా ఉంటుంది.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే సినిమాకి నిర్మాతలు ఐదు లక్షలు. 5 లక్షల మంది ఒక సినిమాను నిర్మించడం ఏంటి అనే కదా మీ అనుమానం.

అది కూడా హిందీ సినిమా.

Indias First Croud Funding Movie , Manthan , National Award, First Croud Fund
Advertisement
India's First Croud Funding Movie , Manthan , National Award, First Croud Fund

1976లో గిరీష్ కర్నాడ్ ( Girish Karnad )నసీరుద్దీన్ షా స్మిత పాటలు వంటి అగ్ర తారలు నటించిన మంథన్( Manthan ) అనే ఒక సినిమా విడుదల అయింది.ఈ సినిమా శ్వేత విప్లవకారుడైన వర్గీస్ కురియన్ అనే మహా నాయకుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.పాల ఉత్పత్తి యొక్క విశిష్టతను అందరికీ తెలియజేసేలా చేసి గుజరాత్ లో పాడి పరిశ్రమను పెంపొందించడంలో వర్గీస్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు.

దాంతో ఈ సినిమాను నిర్మించిన శ్యామ్ బెనగల్ ఆయన ద్వారా లాభపడ్డ రైతులే ఈ సినిమాను నిర్మించాలని ఆలోచన చేశారు.అందుకోసం గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ముందుకు వచ్చింది.

అందులో ఉన్న ఐదు లక్షల మంది తల రెండు రూపాయలు వేసుకొని ఈ చిత్రానికి నిర్మాతలుగా మారారు.ఇలా ఇంత భారీ ఎత్తున క్రౌడ్ ఫండింగ్ చేసిన మొట్టమొదటి సినిమా అలాగే అసలు క్రౌడ్ ఫండింగ్ తోనే తీసిన మొట్టమొదటి సినిమా గా మంథన్ చరిత్రలో నిలిచిపోయింది.

Indias First Croud Funding Movie , Manthan , National Award, First Croud Fund

1976లో వచ్చిన ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు( National Award ) దక్కింది అలాగే ఈ సినిమాలో ఒక పాట పాడిన సింగర్ కి కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు వచ్చింది అలాగే విదేశీ విభాగంలో కూడా ఈ చిత్రాన్ని ఆస్కార్ కి కూడా పంపించారు.ఇలా ఎన్నో అవార్డులకు, రివార్డులకు ఈ చిత్రం వేదికగా మారింది.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు