జర్మనీకి పెరుగుతోన్న భారతీయ పర్యాటకులు.. 2024లో ఎన్ని లక్షల మంది వెళ్లారంటే?

జర్మనీకి( Germany ) భారతీయుల ప్రయాణం తాకిడి పెరిగింది.ఇటీవలి గణాంకాల ప్రకారం 2024లో జర్మనీకి భారతీయ పర్యాటకుల( Indian Tourists ) రాక 8.

6 శాతం మేర పెరిగింది.2023లో 8,26,703గా ఉన్న భారతీయ పర్యాటకుల సంఖ్య 2024 నాటికి 8,97,841 కి చేరుకుంది.భారతదేశం - జర్మనీ మధ్య బలపడిన ఎయిర్ కనెక్టివిటీ( Air Connectivity ) ఈ గణనీయమైన వృద్ధికి ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నెలవారీ విమానాల ఫ్రీక్వెన్సీ జనవరి 2019లో 241 ఉండగా .జనవరి 2025లో 309 (28 శాతం)పెరిగింది.గతేడాది ఇదే కాలంలో మొదటి మూడు నెలల్లో వీసా( Visa ) దరఖాస్తులు దాదాపు 20 శాతం పెరిగాయి.

ప్రత్యక్ష విమానాల పెరుగుదల భారతీయ పర్యాటకులలో జర్మనీ పట్ల పెరుగుతున్న ఆదరణను హైలైట్ చేస్తుంది.జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ (జీఎన్‌టీబీ) , భారతదేశంలోని జర్మన్ రాయబార కార్యాలయం బుధవారం సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా భారతీయ పర్యాటకులకు జర్మనీ అత్యుత్తమ ప్రయాణ గమ్యస్థానంగా నిలిచిందని వారు తెలిపారు.

Advertisement

జంటలు, ప్రకృతి ప్రేమికులు, స్థిరమైన ప్రయాణ అనుభవాలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఆఫర్లు ప్రకటించడం కూడా భారతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.జీఎన్‌టీబీ సైతం వారి స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది.అలాగే భారతీయ పర్యాటకులు జర్మనీలో ఎక్కువకాలం గడుపుతున్నారు.2023లో సగటున 9.3 రాత్రులు గడపగా.ఇది ఇప్పుడు 9.6 రాత్రులకు పెరిగింది.స్క్రిఫ్ట్ ఇండియా నివేదిక ప్రకారం భారత పర్యాటక వ్యయం ప్రపంచ సగటు కంటే నాలుగు రెట్లు వేగంగా పెరుగుతోంది.

ఇది భారతీయ మార్కెట్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

54 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వేలాది మ్యూజియంలు, అనేక కోటలు, ప్రకృతి అందాల కారణంగా జర్మనీ సాంస్కృతిక గమ్యస్థానంగా ఆకర్షిస్తోంది.అలాగే భారత్ - జర్మనీ మధ్య బలమైన వ్యాపార సంబంధాలు .నిపుణులు విశ్రాంతి కార్యకలాపాలను సందర్శించడానికి, అన్వేషించడానికి కారణమవుతున్నాయి.జర్మనీలో దాదాపు 50 వేల మంది భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారు.

దీని కారణంగా ఆ యువకులను కలవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు జర్మనీకి తరచుగా వచ్చిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు