జపాన్ ప్రధానితో భారత ప్రధాని మోదీ భేటీ

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో జపాన్ వెళ్లిన భారత ప్రధాని మోదీ, ఆ దేశ ప్రస్తుత ప్రధాని కిషిడాతో భేటీ అయ్యారు.

ముందుగా షింజో మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మోదీ.ఆయన మృతి భారత్ కు తీరని లోటు అని చెప్పారు.

ఆయన కృషిని భారత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు.అనంతరం ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరువురు ప్రధానులు చర్చించారని సమాచారం.

ఇండో- పసిఫిక్ ప్రాంతంలో బంధాన్ని మరింత బలోపేతంపై కూడా చర్చించారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!