ప్రభుత్వ అధికారిపై( Govt Officer ) దాడి చేసిన నేరంపై భారత సంతతికి చెందిన మహిళకు జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.
శాంతి కృష్ణసామిని( K Santhi Krishnasamy ) దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం.తన కుమారుడు నేషనల్ సర్వీస్ కోసం రిపోర్ట్ చేయడంలో విఫలమవ్వడంతో సెంట్రల్ మ్యాన్‌పవర్ బేస్ (సీఎంపీబీ) అనలిస్ట్ ఇన్‌స్పెక్టర్‌పై శాంతి దాడి చేసింది.
ఈ నేరానికి గాను ఆమెకు 18 వారాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.
జిల్లా జడ్జి క్రిస్టోఫర్ గోహ్( District Judge Christopher Goh ) శిక్షకు గల కారణాలను తెలియజేస్తుండగా శాంతి పదే పదే అంతరాయం కలిగించింది.పబ్లిక్ సర్వెంట్లపై నేరాలు జరిగినప్పుడు, సాధారణ నిరోధమే ప్రధానమైనదన్న ప్రాసిక్యూషన్‌తో తాను ఏకీభవిస్తున్నానని న్యాయమూర్తి ఏకీభవించారు.
అధికారి శరీరానికి వున్న బాడీ కామ్ ఫుటేజ్‌లో శాంతి దురుసు ప్రవర్తన, దాడి స్పష్టంగా కనిపించింది.సంఘటన సమయంలో ప్రభుత్వ అధికారిని ఆమె పలుమార్లు పట్టుకున్నట్లు, లాగినట్లు తేలింది.
అంతేకాదు.నేరం చేసిన పశ్చాత్తాపం కూడా శాంతిలో కనిపించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.తన చర్యలపై ఆమె ఎన్‌లిస్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్‌కు( Enlistment Inspector ) క్షమాపణ చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదని ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో శాంతి కనుక శిక్షపై అప్పీల్ చేయాలనుకుంటే పరిగణించాలని సూచిస్తూ, ఆమె శిక్షను వాయిదా వేశారు.కోర్ట్ రికార్డుల ప్రకారం శాంతి తన శిక్షపై అప్పీల్ చేసింది.
శాంతి కుమారుడు కవింసారంగ్ పిన్( Kavinsarang Shin ) ఏప్రిల్ 23, 2021న ఉదయం పులావు ద్వీపం టెకాంగ్‌లోని ప్రాథమిక సైనిక శిక్షణా కేంద్రంలో నమోదవ్వడంలో విఫలమైనట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోలిన్ ఎన్‌జి తలిపారు.అయితే తన కుమారుడి చేరిక గురించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందలేదని శాంతి చెప్పింది.1967 నాటి సింగపూర్ చట్టం ప్రకారం సింగపూర్ సాయుధ దళాలలో పనిచేయాలనుకునే యువకులకు ఎన్ఎస్ (నేషనల్ సర్వీస్) తప్పనిసరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy