అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తన మంత్రివర్గంలో పలువురు భారత సంతతి నేతలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే జే భట్టాచార్య, హర్మీత్ కే ధిల్లాన్, కాష్ పటేల్, కేష్ దేశాయ్‌లను ట్రంప్ నియమించారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ఇండో అమెరికన్ చేరాడు.దక్షిణాసియా సెక్యూరిటీపై నిపుణుడు పాల్ కపూర్‌ను దక్షిణాసియా వ్యవహారాల సహాయ విదేశాంగ కార్యదర్శిగా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు.
దీనికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే.డోనాల్డ్ లూ స్థానంలో కపూర్ ఈ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
జనవరి 7న డోనాల్డ్ లూ పదవీకాలం ముగియడంతో దక్షిణ , మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి లూ నిష్క్రమణను జనవరి 17న యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ( US Department of State )ధృవీకరించింది.దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో అమెరికా విదేశాంగ విధానంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్,ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలతో సంబంధాలను నిర్వహిస్తుంది.
పాల్ కపూర్( Paul Kapur ).యునైటెడ్ స్టేట్స్ నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.2020-21లో విదేశాంగ శాఖ అనుబంధ విధాన ప్రణాళిక సిబ్బందిలో ఒకడిగా పనిచేశాడు.దక్షిణ, మధ్య ఆసియా, ఇండో - పసిఫిక్ వ్యూహం, ఇండో యూఎస్ సంబంధాలపై కపూర్ పనిచేశాడు.
‘‘ India, Pakistan and the Bomb: Debating Nuclear Stability in South Asia ’’ అనే పుస్తకానికి సహ రచయితగా, ‘‘ The Challenges of Nuclear Security: US and Indian Perspectives ’’కు సహ సంపాదకుడిగానూ వ్యవహరించారు.చికాగో యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన పాల్ కపూర్.యునైటెడ్ స్టేట్స్ - ఇండియా ట్రాక్ 1.5 స్ట్రాటజిక్ డైలాగ్, రక్షణ శాఖ కోసం భారత్ - అమెరికాలకు చెందిన పలు అంశాలపైనా పనిచేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy