అమెరికన్ పబ్లిషింగ్ కంపెనీకి తాత్కాలిక సీఈవోగా భారత సంతతి ఎగ్జిక్యూటివ్...!!

అమెరికన్ దిగ్గజ కంపెనీలకు సారథులుగా భారతీయులు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, శంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్ వంటి వారు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.

తాజాగా భారత సంతతికి చెందిన పబ్లిషింగ్ ఎగ్జిక్యూటివ్ నిహార్ మాలవీయ కూడా ఈ జాబితాలో చేరారు.న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ గ్రూప్ ‘‘ పెంగ్విన్ రాండమ్ హౌస్’’కి తాత్కాలిక సీఈవోగా ఆయన నియమితులయ్యారు.ఈ కంపెనీ ప్రస్తుత సీఈవో మార్కస్ డోహ్లే తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నిహార్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.2019 నుంచి ఈ కంపెనీలో అమెరికన్ డివిజన్‌కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నిహార్ వ్యవహరిస్తున్నారు.2023 , జనవరి 1 నుంచి పెంగ్విన్ రాండమ్ హౌస్‌కు ఆయన తాత్కాలిక సీఈవో బాధ్యతలు స్వీకరిస్తారని ఈ కంపెనీ మాతృసంస్థ బెర్టెల్స్‌మాన్ ఒక కంపెనీలో తెలిపింది.బెర్టెల్స్‌మాన్ గ్రూప్ మేనేజ్‌మెంట్ (జీఎంసీ)లో మాలవీయ చేరుతారని.

అలాగే పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతారని బర్టెల్స్‌మాన్ సీఈవో థామస్ రాబే తెలిపారు.

ప్రెసిడెంట్, సీవోవో హోదాలో మాలవీయ (48) అమెరికాలో సప్లయ్ చైన్, టెక్నాలజీ, డేటా, క్లయింట్ సేవలు వంటి విభాగాలను పర్యవేక్షించారు.2001లో బెర్టెల్స్‌మాన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వామిగా ఆయన తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.2003లో రాండమ్ హౌస్‌కి మారిన మాలవీయ.అనేక హోదాల్లో పనిచేశారు.

Advertisement

న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా పొందిన మాలవీయ, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.అంతేకాకుండా యేల్ యూనివర్సిటీ ప్రెస్ బోర్డ్ మెంబర్ కూడా.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు