ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌కు షాక్ .. ఆ బాధ్యతల నుంచి తొలగింపు

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను( Kash Patel ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన సంగతి తెలిసిందే.

తద్వారా ఎఫ్‌బీఐ అధిపతిగా( FBI Chief ) బాధ్యతలు స్వీకరించిన తొలి హిందూ, తొలి భారత సంతతి వ్యక్తిగా కాష్ పటేల్ చరిత్ర సృష్టించారు.

అలాంటి కాష్ పటేల్‌కు గట్టి షాక్ తగిలింది.ఆయనను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టుబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించారు.

కాష్ పటేల్ స్థానంలో యూఎస్ ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్‌ను( Daniel Driscoll ) నియమించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డేనియల్ డ్రిస్కాల్ ఆర్మీ సెక్రటరీగా కొనసాగుతూనే .అమెరికా న్యాయశాఖ అనుబంధ విభాగమైన ఏటీఎఫ్‌ను( ATF ) కూడా పర్యవేక్షిస్తారని వార్తలు వస్తున్నాయి.ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రమాణం చేసిన కొద్దిరోజులకే .ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఏటీఎఫ్ యాక్టింగ్ డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.అయితే పటేల్‌లను ఏటీఎఫ్ అధిపతి బాధ్యతల నుంచి ఎప్పుడూ తొలగించారో తెలియరాలేదు.

Advertisement

ఇప్పటికీ పటేల్ ఫోటో, ఆయన హోదా ఇప్పటికీ ఏటీఎఫ్ వెబ్‌సైట్‌లో కనిపిస్తోందని కొందరు చెబుతున్నారు.

ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎఫ్‌ను యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌తో విలీనం చేయాలా? వద్దా? అని న్యాయశాఖ కసరత్తు చేస్తున్న సమయంలో ఏటీఎఫ్‌లో నాయకత్వ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.ఏటీఎఫ్ అనేది దాదాపు 5500 మంది ఉద్యోగులతో కూడిన ప్రత్యేక ఏజెన్సీ.తుపాకీలు, పేలుడు పదార్ధాలు, ఎక్స్‌ప్లోజివ్స్‌కు సంబంధించి అమెరికా చట్టాలను అమలు చేసే బాధ్యత ఈ సంస్థదే.

ఫెడరల్ గన్ డీలర్లకు లైసెన్స్ ఇవ్వడం, నేరాలలో నిందితులు ఉపయోగించిన తుపాకులను గుర్తించడం, కాల్పుల ఘటనల్లో నిఘా సమాచారాన్ని విశ్లేషించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ చేపడుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు