కెనడా ఎన్నికలు : ఖలిస్తానీయులకు షాక్ ... ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ దారుణ పరాజయం

కెనడా ఫెడరల్ ఎన్నికల్లో( Canada Federal Elections ) ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి.

అన్నింటికి మంచి భారత సంతతి నేత, ట్రూడో ప్రభుత్వం కింగ్ మేకర్‌గా వ్యవహరించిన న్యూడెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) దారుణ పరాజయం పాలయ్యారు.

ఆయన ఓటమి ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులకు గట్టి షాక్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బ్రిటీష్ కొలంబియాలోని బర్నబీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించాలని జగ్మీత్ భావించారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా లిబరల్ పార్టీ అభ్యర్ధి వేడ్ చాంగ్ చేతిలో జగ్మీత్ ఓటమి పాలయ్యారు.జగ్మీత్‌కు 27 శాతం ఓట్లు రాగా.

చాంగ్‌కు 40 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

Advertisement

జగ్మీత్ వ్యక్తిగతంగా ఓడిపోవడంతో పాటు ఎన్డీపీ ( NDP ) కూడా పేలవ ప్రదర్శన చేసింది.అంతేకాదు.జాతీయ పార్టీ హోదాకు కావాల్సిన 12 సీట్లను గెలుచుకోలేకపోవడంతో పార్టీ గుర్తింపుపై ప్రభావం పడనుంది.

ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎన్డీపీ నాయకత్వ బాధ్యతల నుంచి జగ్మీత్ సింగ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి, ఖలిస్తాన్ అనుకూల గ్రూపులకు జగ్మీత్ సింగ్ గట్టి మద్ధతుదారు.

ఆయన అండ చూసుకునే కెనడాలో ఖలిస్తాన్ గ్రూపులు రెచ్చిపోయేవి.అప్పట్లో ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో ట్రూడోకు( Trudeau ) ఎన్‌డీపీ మద్దతు కీలకం.

అందుకే జగ్మీత్‌ను ఆకట్టుకోవడానికి ఖలిస్తానీయులు ఏం చేసినా పట్టించుకోలేదు ట్రూడో.ఇప్పుడు జగ్మీత్ ఓడిపోవడంతో పాటు ప్రభుత్వాన్ని శాసించే పరిస్ధితుల్లో లేకపోవడంతో కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!

మరోవైపు.మార్క్ కార్నీ( Mark Carney ) నేతృత్వంలోని లిబరల్ పార్టీ కెనడాలో నాలుగో సారి అధికారాన్ని అందుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే లిబరల్ పార్టీ అధికారానికి కావాల్సిన మెజార్టీ మార్కు 172 స్థానాలకు చేరువలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఒకవేళ మెజార్టీ రానీ పక్షంలో చిన్న చితకా పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోవాల్సి వస్తుంది.అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకుండానే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీ కొట్టారు మార్క్ కార్నీ.

అటు ఈసారి ఖచ్చితంగా అధికారాన్ని అందుకుంటామని అనుకున్న పియర్ పోలియెవ్రే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 147 స్థానాల్లో విజయం సాధించింది.

తాజా వార్తలు