వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు(Indian-origin ) అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్నారు.
అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ వ్యవస్ధలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు.
తాజాగా బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వైద్యురాలు అరుదైన ఘనత సాధించారు.యూకేలోని ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ (ఆర్‌సీపీ)(Royal College of Physicians (RCP)) 123వ అధ్యక్షురాలిగా డాక్టర్ ముంతాజ్ పటేల్ నియమితులయ్యారు.
ఆర్‌సీపీ అధ్యక్షుడు .ఆర్‌సీపీ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా, ట్రస్టీల బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తారు.అధ్యక్షుడు సిఫారసు చేయబడిన 4 ఏళ్ల పదవీకాలానికి ఎన్నుకోబడతారు.
ఈ పదవి కోసం మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 మధ్య జరిగిన ఎన్నికల్లో డాక్టర్ ముంతాజ్ పటేల్(Dr.Mumtaz Patel) 2,239 ఓట్లను పొందగా.
ఆ తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్ధికి 682 ఓట్లు వచ్చాయి.ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పటేల్ మాట్లాడుతూ.
ఆర్‌సీపీ అధ్యక్షుడిగా(RCP President) తాను సంస్థను అత్యుత్తమంగా నడిపిస్తానని తెలిపారు.రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
డాక్టర్ పటేల్ మాంచెస్టర్‌లో స్థిరపడిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్.ఆమె ప్రస్తుతం ఆర్‌సీపీ సీనియర్ సెన్సార్ , ట్రైనింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా(RCP Senior Censor, Vice President of Training) ఉన్నారు.గతేడాది జూన్ నుంచి దీనికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
సీనియర్ సెన్సార్‌గా ఎన్నికయ్యే ముందు ఆమె గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ట్రైనింగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా, ఆర్సీపీ రీజనల్ అడ్వైజర్‌గా పలు హోదాలో పనిచేశారు డాక్టర్ ముంతాజ్.
వాయువ్య ప్రాంతంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఇంగ్లాండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అసోసియేట్ డీన్.విద్య, శిక్షణ, అంచనా, పరిశోధనలలో బలమైన ట్రాక్ రికార్డును స్ధాపించారు.
యూకేతో పాటు అంతర్జాతీయంగా పలు విద్యా, లీడర్‌షిప్ కోర్సులను రూపొందించారు.అలాగే పీఏసీఈఎస్ ఎగ్జామినర్‌గా మూల్యాంకనంలో చురుగా పాల్గొంటున్నారు.
రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్‌ను 1518లో లండన్‌లో స్థాపించారు.దీనికి 507 సంవత్సరాల చరిత్ర ఉంది.మే 2021 నాటికి ఈ సంస్థలో దాదాపు 40 వేల మంది సభ్యులు ఉండగా.2019 వరకు 414 మంది సిబ్బంది ఉన్నారు.యూకేలో మెడికల్ ప్రాక్టీస్ ప్రమాణాలు పెంచడంతో పాటు వైద్యులకు అక్రిడిటేషన్ సేవలను ఈ సంస్థ అందిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy