దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు భారత సంతతి ప్రముఖులకు ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘నేషనల్ ఆర్డర్స్’’( National Orders ) లభించాయి.
వీరిలో దివంగత పోరాట యోధుడు ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం( Ismail Ibrahim ), శాస్త్రవేత్త డాక్టర్ అబౌబకర్ ఇబ్రహీం( Dr.
Abubakar Ibrahim ) డాంగోర్‌లు వున్నారు.శుక్రవారం ప్రిటోరియాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు.
తన దేశ పౌరులకు, ప్రజాస్వామ్య పురోగతికి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిన విదేశీ వ్యక్తులకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ‘‘నేషనల్ ఆర్డర్స్’’ అందిస్తోంది.కాగా.మనుషులంతా ఒక్కటేనని.
రంగు, లింగం ఆధారంగా వారి పట్ల వివిక్ష వుండరాదని పోరాటం జరిపి దక్షిణాఫ్రికాలో నల్లజాతి హక్కుల్ని సాధించిన మహనీయుడు నెల్సన్ మండేలా.ఆయనతో పాటు ఈ పోరాటంలో పాల్గొన్న హక్కుల నేత, భారత సంతతికి చెందిన ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం.
హక్కుల పోరాటంలో భాగంగా అరెస్టయి నెల్సన్ మండేలా( Nelson Mandela ), అహ్మద్ కత్రాడాతో కలిసి ఆయన రాబెన్ ద్వీపంలో ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు.కామ్రేడ్ ఏబీ అంటూ అభిమానులు ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు.
దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలను నిరోధించే చట్టాలను ధిక్కరించినందుకు ఇస్మాయిల్‌ను రెండుసార్లు అరెస్ట్ చేశారు.13 ఏళ్ల చిరుప్రాయంలోనే ఆయన దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంలో చేరారు. శ్రీలంక, పాలస్తీనా, రువాండా, కొసావో, బొలీవియా, నేపాల్‌లలో జరిగిన వివిధ భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ శైలి నుంచి తాను ఎలా ప్రేరణ పొందింది ఇస్మాయిల్ వివరించేవారు.ఉద్యమం ముగిసి దక్షిణాఫ్రికా మొదటి ప్రజాస్వామ్యబద్ధ అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.
వారిలో ఇస్మాయిల్ కూడా వున్నారు.అంతేకాదు మండేలా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, పార్లమెంటరీ కౌన్సెలర్ సహా వివిధ హోదాలలో పనిచేశారు.అనారోగ్యంతో బాధపడుతూ.2021 డిసెంబర్‌లో ఇస్మాయిల్ తుదిశ్వాస విడిచారు.
ఇక డాక్టర్ డాంగోర్ విషయానికి వస్తే ఆయనకు ‘‘ఆర్డర్ ఆఫ్ లుతులీ ఇన్ సిల్వర్ ’’( Order of Luthuli in Silver ) లభించింది.భౌతిక శాస్త్రంలో తన అద్భుతమైన పరిశోధన ద్వారా సైన్స్‌కి చేసిన సేవలకు గాను డాంగోర్‌కు ఈ అవార్డ్‌ను ప్రదానం చేశారు.1961లో విట్స్ యూనివర్సిటీలో ఆనర్స్ డిగ్రీని పొందిన ఆయన అనంతరం యూకేకు వెళ్లారు.అప్పట్లో దక్షిణాఫ్రికాలో అధికారంలో వున్న తెల్లజాతి ప్రభుత్వం.
డాక్టర్ డాండోర్ భార్యకు బెర్ముడా నుంచి ప్రవేశాన్ని నిరాకరించిన కారణంగా ఆయన తన స్వదేశానికి రాలేకపోయారు.ఇప్పుడు కూడా అవార్డ్ ప్రదానోత్సవానికి డాక్టర్ డాంగోర్ హాజరుకాలేకపోయారు.
ఈ అవార్డ్‌ను ఆయన మనవడు మహమ్మద్ రయీస్ డాంగోర్ అందుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy