పన్నూన్‌ హత్యకు కుట్ర కేసు : అనుమానితుడు నిఖిల్ గుప్తాని అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్

ఖలిస్తాన్ వేర్పాటువాది , సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్ధాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannun ) హత్యకు కుట్ర పన్నినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను( Nikhil Gupta ) చెక్ రిపబ్లిక్ నుంచి అమెరికాకు రప్పించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పన్నూన్ హత్య కుట్రలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వ అభ్యర్ధన మేరకు గతేడాది చెక్ రిపబ్లిక్‌లో( Czech Republic ) నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు.

న్యాయ పరమైన ప్రక్రియ ముగిసిన అనంతరం చెక్ ప్రభుత్వం నిఖిల్‌ను అమెరికాకు అప్పగించినట్లుగా కథనాల సారాంశం.అతనిని ఇవాళ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం వుంది.

గుప్తా ప్రస్తుతం బ్రూక్లిన్ లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నాడని కథనాలు తెలిపాయి.చెక్ రిపబ్లిక్ అతనిని అమెరికాకు( America ) అప్పగించినట్లుగా నివేదించిన మొదటి వార్తాసంస్థ వాషింగ్టన్ పోస్ట్.

అప్పగింత ప్రక్రియ ద్వారా అమెరికాకు వచ్చిన ముద్దాయిలు 24 గంటల్లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని ది డైలీ పేర్కొంది.

Indian National Nikhil Gupta Accused Of Plotting To Kill Gurpatwant Singh Pannun
Advertisement
Indian National Nikhil Gupta Accused Of Plotting To Kill Gurpatwant Singh Pannun

కాగా.సిక్కులకు ( Sikhs )ప్రత్యేక దేశం కావాలని గళమెత్తుతోన్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడి హత్యకు కుట్ర జరిగిందని ఆ దేశం ఆరోపించింది.ఈ మేరకు భారత్ నుంచి నిందితుడికి ఆదేశాలు అందాయని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది.

కానీ ఈ ప్రకటనలో మాత్రం పన్నూ పేరును నేరుగా ప్రస్తావించలేదు.గురుపత్వంత్‌ను హత్య చేయడానికి నిఖిల్ గుప్తా ఓ కిరాయి హంతకుడికి 15 వేల డాలర్లు అడ్వాన్స్‌‌గా చెల్లించాడని, ఇందులో పేరు తెలియని ఓ భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉన్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

Indian National Nikhil Gupta Accused Of Plotting To Kill Gurpatwant Singh Pannun

నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేయగా.అతడిని తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది.మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్ గతంలోనే స్పందించింది.

నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఒకవేళ ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే నిఖిల్ గుప్తాకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు