ఫోర్బ్స్ జాబితాలో భారతీయ కంపెనీలకి స్థానం..

అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 అతిపెద్ద కంపెనీల జాబితాని ప్రకటించింది.ఈ జాబితాలో దాదాపు 57 భరత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.

ఎప్పటికప్పుడు ప్రపంచంలో వివిధ అంశాలని, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల గూర్చి ప్రచురించే ఈ మ్యాగజైన్ తాజాగా అతిపెద్ద పబ్లిక్ కంపెనీల జాబితాని ప్రకటించింది.భారత్ నుంచీ చోటు దక్కించుకున్న వాటిలో ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గృహ రుణ సంస్థలు అయిన హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి.

మొత్తం జాబితాల్లో ఇండస్ట్రియల్‌ అండ్ కమర్షియల్ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వరుసగా 7వ సారి కూడా మొదటి స్థానం కైవసం చేసుకుంది.అంతర్జాతీయంగా 71వ ర్యాంక్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారతీయ కంపెనీల్లో ముందు ఉంది.

ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో రిలయన్స్ ఇండస్ట్రీ 11 ర్యాంక్ పొందగా, రాయల్‌ డచ్‌ షెల్‌ మొదటి స్థానం దక్కించుకుంది.హెచ్‌డీఎఫ్‌సి 332 స్థానంలో నిలవగా మొత్తం 61దేశాల జాబితాలో అమెరికా 575 కంపెనీలతో ఆధిపత్యాన్ని కొనసాగించింది.

Advertisement

ఆ తరువాత వరుసలో చైనా, హాంకాంగ్ నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు