భారత సంతతికి చెందిన ఫిర్దౌస్ ఖరస్‌ను( Firdaus Kharas ) కెనడా అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘‘ ఆర్డర్ ఆఫ్ కెనడా ’’( Order of Canada ) వరించింది.
మానవ కేంద్రీకృత మీడియా ద్వారా సామాజిక సేవ చేసినందుకు ఈ పురస్కారం దక్కింది.
ఆర్డర్ ఆఫ్ కెనడా 2023 నియామకాల వార్షిక జాబితాను కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్( Mary Simon ) గురువారం విడుదల చేశారు.ఆర్డర్ ఆఫ్ కెనడా .దేశ అత్యున్నత గౌరవాలలో ఒకటి.కెనడాకు( Canada ) అసాధారణమైన , నిరంతర సహకారాలు అందించిన సమాజంలోని అన్ని రంగాలలోని వ్యక్తులను సత్కరించేందుకు ఉద్దేశించారు.
ఆర్డర్ ఆఫ్ కెనడాను 74 మంది అధికారులకు ప్రకటించింది సైమన్ కార్యాలయం.
68 ఏళ్ల ఖరస్ సామాజిక వ్యవస్ధాపకుడిగా, మాస్ కమ్యూనికేషన్స్ మీడియా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ఆయనకు ఆర్డర్ ఆఫ్ కెనడా పురస్కారం వరించింది.దీనిపై ఖరస్ స్పందించారు.
ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరించడం తనను కదిలించిందని, వలసదారునిగా తనకు ఇది అర్ధవంతమైనదని ఖరస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉన్నత స్థాయి సాధించిన కమ్యూనిటీ అయినప్పటికీ పార్సీలు( Parsis ) కెనడాలో 3,600 మంది మాత్రమే వుండి మైనారిటీ తరగతిలో వున్నారని , అందువల్ల ఈ విధమైన గుర్తింపు సంతృప్తికరంగా వుందని ఖరాస్ తెలిపారు.
ఆర్డర్ ఆఫ్ కెనడా పురస్కారం పొందిన వారికి త్వరలోనే అవార్డులను ప్రధానం చేయనున్నారు.దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.ఖరస్ 1995లో చాక్లెట్ మూస్ మీడియాను( Chocolate Moose Media ) స్థాపించారు.
ఇది మానవ స్థితిని మెరుగుపరిచేందుకు మాస్ కమ్యూనికేషన్‌లను రూపొందించడానికి ఏర్పడిన ఓ సామాజిక సంస్థ.ఆయన చర్య భారత్‌తో పాటు 198 దేశాలలో అనేక భాషలలో ఉపయోగించబడింది.
ఈ క్రమంలో ఖరస్.ప్రతిష్టాత్మక పీబాడీ అవార్డ్ సహా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు సహా 125 పురస్కారాలను అందుకున్నారు.
ఖరస్‌కు అవార్డ్ దక్కడంపై కెనడాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy