టాస్ గెలిచి బ్యాటింగ్ ఇంచుకున్న టీమిండియా

ప్రపంచ కప్‌లో భాగంగా వరుస విజయాల తో దూసుకెళుతున్న టీమిండియా ఈ రోజు ఆఫ్ఘన్ తో తలపడుతుంది.

ఈ క్రమంలో టాస్ వేయగా టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది టీమిండియా.

అయితే తొలుత రోహిత్ శర్మ,కే ఎల్ రాహుల్ లు బరిలోకి దిగగా తక్కువ స్కోరు వద్దే కీలక ఆటగాడు రోహిత్ వికెట్ ను టీమిండియా కోల్పోయింది.వరుస సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌శర్మ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు.

ముజీబ్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి క్లీన్‌ బౌల్డయ్యాడు.దీనితో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ క్రీజులోకి రావడం తో ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సమాయణానికి రాహుల్(22) పరుగులతో కోహ్లీ(26) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచింది.ఒక మ్యాచ్‌ రద్దయింది.ఈ మ్యాచ్‌ గెలిచి సెమీస్‌కు బెర్తు సులభం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

Advertisement

ఇక అఫ్గాన్‌ జట్టు మెగా టోర్నీలో ఇంతవరకు బోణీ యే కొట్టలేదు.దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని ఆ జట్టు భావిస్తుంది.

మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి .

Advertisement