సెప్టెంబర్ 17న భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్..ఈ జట్లు ఫైనల్లో ఎన్నిసార్లు తలపడ్డాయంటే..!

ఆసియా కప్( Asia Cup ) 2023 టోర్నీ లో సెప్టెంబర్ 17న భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగనుంది.

గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు ఫైనల్ రేసు నుండి తప్పుకుంది.

శ్రీలంక-పాకిస్తాన్( Pakistan Vs Sri Lanka ) మ్యాచ్ ను వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించగా.చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శ్రీలంక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది.

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్-పాకిస్తాన్ ( India-Pakistan )జట్లు ఫైనల్ లో తలపడలేదు.2023లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడితే చూడాలి అనుకునే అభిమానుల ఆశ మాత్రం నిరాశ గానే మిగిలింది.ఆసియా కప్ లో భారత్-శ్రీలంక జట్లు ఫైనల్లో ఏకంగా 8సార్లు తలపడ్డాయి.సెప్టెంబర్ 17న 9వ సారి ఫైనల్లో తలపడేందుకు భారత్, శ్రీలంక జట్లు సిద్ధమయ్యాయి.1984లో యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తొలిసారి భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి తొలి ఆసియా కప్ లో బోణి కొట్టింది.

ఆ తర్వాత 1988, 1991, 1995లలో భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడితే.వరుసగా భారత జట్టే విజేతగా నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.

Advertisement

1997లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ పై చేయి సాధించి శ్రీలంక టైటిల్ కైవసం చేసుకుంది.ఆ తరువాత 2004, 2008 లో ఫైనల్ పోరులో భారత్ పై శ్రీలంక పైచేయి సాధించింది.2010 లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ పైచేయి సాధించింది.2010 తర్వాత ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగిన ఇరుజట్లు ఫైనల్ తెలపడలేదు. ఆసియా కప్ టోర్నీలో 8సార్లు తలపడ్డ ఈ జట్లలో ఐదుసార్లు భారత్ విజయం సాధించగా.

మూడుసార్లు శ్రీలంక విజయం సాధించింది.తాజాగా 2023 లో విజేతగా నిలిచేందుకు భారత్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు