భారత్- ఆస్ట్రేలియా( India vs Australia ) మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో భారత్ 2-0 తేడాతో ఇప్పటికే టైటిల్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా జట్టును పసికూన జట్టుని చేసి భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు.
మొహలీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.తాజాగా ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఏకంగా 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టును భారత్ చిత్తుగా ఓడించింది.
భారత జట్టు బ్యాటర్లు, బౌలర్లు చెలరేగడంతో ఇప్పటికే సిరీస్ ఖాతాలో పడడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి.
తాజాగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ లో మొత్తం 18 సిక్సులు, 30 ఫోర్లు నమోదు అయ్యాయి.దీంతో వన్డేలలో 3 వేలకు పైగా సిక్సులు బాదిన తొలి జట్టుగా భారత్ అవతరించింది.వన్డే చరిత్రలో భారత్ 3007 సిక్స్ లు నమోదు చేసింది.
భారత జట్టు 399 పరుగులతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.భారత జట్టు ఇండోర్ వేదికగా ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలోనూ విజయం సాధించింది.
ఒకే వేదికపై వరుసగా విజయాలను నమోదు చేసిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది.భారత ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే.ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) సరికొత్త రికార్డు సృష్టించాడు.
అశ్విన్ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 144 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ ఖాతాలో చెత్త రికార్డు నమోదయింది.సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కు బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సులు సమర్పించుకున్నాడు కామెరూన్ గ్రీన్.గ్రీన్ 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో ఆస్ట్రేలియా బౌలర్ గా కామెరూన్ గ్రీన్ నిలిచాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy