కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రతను పెంచండి.. కెనడాను కోరిన భారత ప్రభుత్వం, కారణమిదే..?

వాంకోవర్‌లో భారత కాన్సులేట్ కార్యాలయాన్ని నిరసనకారులు దిగ్బంధించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొందరు ఖలిస్తాన్ అనుకూల ప్రసంగాలు చేయడం కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీతో సహా కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కెనడాను భారత ప్రభుత్వం కోరింది.

ఒట్టావాలోని భారత హైకమీషన్ .కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్లోబల్ అఫైర్స్ కెనడాకు జారీ చేసిన నోట్ ద్వారా ఈ మేరకు అభ్యర్ధించింది.కెనడాలోని మిషన్‌లకు బెదిరింపులకు సంబంధించిన ఖచ్చితమైన, నిర్ధిష్ట సమాచారాన్ని వారికి తెలియజేసినట్లు సీనియర్ దౌత్య అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

పంజాబ్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఈ ఏడాది కెనడాలో ఆందోళన నెలకొంది.వాంకోవర్‌లో రిపబ్లిక్ డే కార్యక్రమాలను అడ్డుకుంటామని ఇప్పటికే వేర్పాటువాద సిక్కు సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నుంచి బహిరంగంగా హెచ్చరికలు వచ్చాయి.

మిగిలిన సిక్కు సంస్థలు టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్‌‌ వరకు కార్ల ర్యాలీని, ఒట్టావాలోని హైకమీషన్ ముందు నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.భారత ప్రభుత్వ విజ్ఞప్తితో స్పందించిన కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

Advertisement
India Asks For Enhanced Security At Its Missions In Canada,Canada, India, Vancou

దౌత్య కార్యాలయాల వద్ద పెట్రోలింగ్‌ను మెరుగుపరచడంతో పాటు సిబ్బందిని మోహరిస్తామని హామీ ఇచ్చారు.ఎస్ఎఫ్‌జే నేత గురుపత్వంత్ పన్నూ.

ఖలిస్తాన్‌కు మద్ధతుగా వున్న కార్యకర్తలను జనవరి 26న కెనడాలోని ఎంబసీ కార్యాలయాల వద్ద ‘‘రైజ్ ఖలిస్తాన్- బ్లాక్ తిరంగా’’కు పిలుపునిచ్చినట్లుగా సమాచారం.వాంకోవర్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

అంటారియో గురుద్వారాస్ కమిటీ, సిక్కు మోటార్ సైకిల్ క్లబ్ ఆఫ్ కెనడా తదితరులు ఈ ర్యాలీలో పాల్గొంటారని శిరోమణి అకాలీదళ్ (కెనడా) సీనియర్ సభ్యుడు సుఖ్మీందర్ సింగ్ హన్స్రా చెబుతున్నారు.గతేడాది కూడా కెనడాలోని వాంకోవర్‌లో వున్న ఇండియన్ కాన్సులేట్‌ను దిగ్బంధించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

India Asks For Enhanced Security At Its Missions In Canada,canada, India, Vancou

కాగా.కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతేడాది కోరిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ముగ్గురు సభ్యుల ఎన్ఐఏ బృందం .కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్‌జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు