Salmon fish : పోషకాలకు పవర్ హౌస్ సాల్మన్ ఫిష్.. నెలకు ఒక్కసారి తిన్నా బోలెడు లాభాలు!

సండే వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే.చాలా మంది చికెన్, మటన్ వంటి వాటిని ఇష్టపడతారు.

అయితే వాటితో పోలిస్తే చేపలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి.చేపల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.

అందులో సాల్మన్ ఫిష్( Salmon fish ) కూడా ఒకటి.బహుశా చాలామంది సాల్మన్ ఫిష్ పేరు కూడా విని ఉండరు.

చేపల్లో ది బెస్ట్ వన్ సల్మాన్ ఫిష్.దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Advertisement

అలాగే పోషకాలకు సాల్మన్ ఫిష్ పవర్ హౌస్ లాంటిది.సాల్మన్ ఫిష్ లో వివిధ రకాల మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Minerals, vitamins, protein, omega 3 fatty acids ) ఉంటాయి.

సాల్మన్ ఫిష్ ను నెలకు ఒకసారి తిన్నా కూడా బోలెడు లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రధానంగా గుండె ఆరోగ్యానికి సాల్మన్ ఫిష్ ఎంతో మేలు చేస్తుంది.

ఈ చేపల్లో మెండుగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తాయి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

అలాగే సాల్మన్ ఫిష్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు చురుగ్గా మారుతుంది.మరియు ఈ చేప‌లో ఉండే పోషకాలు వయస్సు వల్ల వచ్చే మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సాల్మన్ ఫిష్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

Advertisement

వెయిట్ లాస్ ( Weight loss )కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ చేపలు సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.మెదడు ఆరోగ్యానికి సాల్మన్ ఫిష్ చాలా మంచిది.

సాల్మన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని రెట్టింపు చేస్తాయి.మరియు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.సాల్మోన్ ఫిష్‌లో విటమిన్ డి కూడా ఉంటుంది.

ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.బోలు ఎముకల వ్యాధికి ( osteoporosis )వ్యతిరేకంగా పోరాడుతుంది.

ఇక సాల్మన్ ఫిష్ లో మన శరీరానికి అవసరమయ్యే జింక్, పొటాషియం, విటమిన్ బి వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.కాబట్టి ఈసారి మార్కెట్లో సాల్మన్ ఫిష్ కనబడితే అసలు వదలకండి.

వీలైనంత వరకు నెలకు కనీసం ఒక్కసారైనా ఈ సాల్మన్ ఫిష్ ని తినేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు