మామిడి పండు తిని తొక్క‌లు పారేస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే అస్సలు వ‌దిలిపెట్టరు!

ప్రజలు అత్యంత ఇష్టంగా తినే పండ్లలో మామిడి( Mango ) మొదటి స్థానంలో ఉంటుంది.

అందుకే మ్యాంగో ను కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ గా చెప్పబడింది.

ఎంతో రుచికరమైన మామిడి పండ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి.అందుకే మామిడి పండ్లు తినడం కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక చూస్తుండగానే సమ్మర్ సీజన్ వచ్చింది.అంటే మామిడి పండ్ల సీజన్ ప్రారంభం అయ్యింది.

మామిడి పండ్లను ఓ పట్టు పట్టేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు.చాలా మంది మామిడి పండ్లు తినే సమయంలో తొక్క తీసి డస్ట్ బిన్ లోకి తోసేస్తూ ఉంటారు.

Advertisement

తొక్కతో పాటుగా తినేందుకు అస్సలు ఇష్టపడరు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.నిజానికి మామిడి పండ్లు మాత్రమే కాదు మామిడి తోక్కలు( Mango Peel ) కూడా మనకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి.

మామిడి తొక్కలు యాంటీ డయాబెటిక్ ల‌క్ష‌ణాల‌ను కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.మామిడి తొక్క‌ల‌తో టీ( Mango Peel Tea ) త‌యారు చేసుకుని తాగితే చాలా మంచిది.

మామిడి తొక్క‌ల్లో మాంగిఫెరిన్ అనే స‌మ్మేళ‌నాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రిస్తాయి.ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుప‌రుస్తాయి.

మామిడి తొక్క‌ల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్( Anti Oxidants ) క్యాన్స‌ర్ రిస్క్ ను త‌గ్గిస్తాయి.ప్ర‌ధానంగా పెద్దప్రేగు క్యాన్సర్, మెదడు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.అలాగే గాయాల‌ను మామిడి తొక్క‌లు వేగంగా త‌గ్గిస్తాయి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

అందుకోసం మామిడి తొక్క సారాన్ని గాయాలకు పూయాలి.ఇలా చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

మ‌రియు ఇన్ఫెక్షన్ ప్రమాదం సైతం త‌గ్గుతుంది.

ఇక మామిడి తొక్క‌లు నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.నోటి నుంచి దుర్వాస‌న రాకుండా అడ్డుకుంటాయి.అందుకోసం మామిడి తొక్క‌లు వేసి మ‌రిగించిన నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే బ్యాడ్ బ్రీత్ ప్రాబ్ల‌మ్ దూరం అవుతుంది.

తాజా వార్తలు