తిరుపతి జిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

తిరుపతి జిల్లా యర్రవారిపాలెం మండలంలో ఎర్రచందనం పట్టుబడింది.ఎల్లమంద క్రాస్ వద్ద 31 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు కార్లు, రెండు బైకులను సీజ్ చేశారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?