తిరుమలలో నేటి సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.సాయంత్రం 5.45 నుండి 6.

15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య, మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.

అంతకుముందు గరుడ బొమ్మ గీసి గరుడద్వజ పటంను తిరుమాడ విధులలో ఊరేగించారు.ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

వారంలో 3 సార్లు ఈ మిల్క్ షేక్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిలం!

తాజా వార్తలు