ఆపరేషన్ ఏపీ : బీజేపీ లో చేరాలంటే బ్యాగ్రౌండ్ ఉండాల్సిందే 

ఏపీలో క్రమక్రమంగా బలం పెంచుకునే దిశగా బిజెపి ( BJP )అడుగులు వేస్తోంది.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతానికి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నా.భవిష్యత్తులో సమన్వయ లోపం ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు బిజెపి చేరికల విషయంలో వ్యవహాత్మకంగా వ్యవహరిస్తోంది.పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న బిజెపి.

చేరికల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది.ఏపీలో కూటమి ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బిజెపిలో చేరారు .అయితే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తరువాత చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే , కూటమి పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారు.  అందుకే ఇకపై పార్టీలో చేరే వారి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని,  దీనికి సంబంధించి మండల , జిల్లా , రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసేందుకు బిజెపి సిద్ధం అవుతోంది.

Advertisement

ఎన్నికలకు ముందు,  ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు,  చేరికలు సర్వసాధారణమే .వ్యక్తులను బట్టి నియోజకవర్గలను బట్టి ఆ చేరికల్లో ప్రాధాన్యం ఉంటుంది.అయితే గ్రామ మండల స్థాయిలో నాయకులు చేరిక విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా,  నియోజకవర్గ ,రాష్ట్ర స్థాయి నేతలను చేర్చుకునే విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

హడావుడిగా వారిని  చేర్చుకోకూడదని నిర్ణయించుకుంది.  రాబోయే రోజుల్లో ఈ నిబంధనలను మరింత కఠిన తరం చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోంది.  ప్రస్తుతం కూటమిలో ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరే వారి విషయలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర బిజెపి నాయకత్వం భావిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ, వైసీపీల( TDP , YCP ) మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉంది.  దీంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

బిజెపి పొత్తు తో తిరుగులేని విధంగా ఏపీలో ఎన్డీఏ కూటమి( NDA alliance in AP ) బలంగా ఉంది .ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న కీలక నాయకులు చాలామంది బిజెపిలో చేరి కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు.అటువంటి వారిని చేర్చుకుంటే టిడిపి అధిష్టానం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని బిజెపి భావిస్తోంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

  అందుకే చేరే వారి వివరాలను పూర్తిగా పరిశీలించి , వారు బిజెపిలో చేరడానికి గల కారణాలు ఏమిటి ? వారిపై కేసులు ఉన్నాయా ? వారిని చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు ఇలా అన్నిటిని పూర్తిగా పరిశీలించి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వారిని చేర్చుకోవాలని బిజెపి నిర్ణయించుకుందట.

Advertisement

తాజా వార్తలు