న‌ల్గొండ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

న‌ల్గొండ జిల్లాలో దారుణం జ‌రిగింది.ప్రేమ పేరుతో వేధిస్తూ ఓ యువ‌తిపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు ప్రేమోన్మాది.

తీవ్ర‌గాయాలు కావ‌డంతో బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ఈ ఘ‌ట‌న జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ఫారెస్ట్ పార్కులో చోటుచేసుకుంది.

దేవ‌ర‌కొండ రోడ్డులో నివాస‌ముంటున్న రోహిత్ అనే యువ‌కుడు గ‌త కొన్ని నెల‌లుగా న‌వ్య అనే యువ‌తిని ప్రేమ పేరుతో వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు తెలుస్తోంది.మొహ‌రం పండుగ నేప‌థ్యంలో సెల‌వు రావ‌డంతో న‌వ్య ఆమె స్నేహితురాలితో కలిసి పార్కుకు వెళ్లింది.

అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన రోహిత్.న‌వ్య‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు.

Advertisement

అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార్ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు.తీవ్ర గాయాల‌పాలైన బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

Advertisement