వైరల్ వీడియో: వామ్మో.. అంపైర్ అవుట్ ఇచ్చాడని కోపంతో ఏకంగా హెల్మెట్ తీసుకోని..

Max60 కరేబియన్ లీగ్ 2024( Max60 league 2024 )లో 60 - 60 బంతుల మ్యాచ్‌ లు జరుగుతాయి.

ఈ లీగ్ దశలో 5 జట్ల మధ్య పోటీ జరిగింది.

ఇప్పుడు సూపర్-3 రౌండ్ జరుగుతోంది.ఈ సీజన్‌లో 22వ మ్యాచ్ న్యూయార్క్ స్ట్రైకర్స్, గ్రాండ్ కేమన్ జాగ్వార్స్ జట్ల మధ్య జరిగింది.

ఈ మ్యాచ్‌ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.న్యూయార్క్ స్ట్రైకర్స్ బ్యాట్స్‌మెన్ కోపంతో బంతికి బదులుగా తన హెల్మెట్‌ ను బౌండరీకి ​​పంపించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, వెస్టిండీస్( West Indies) మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్( Carlos Brathwaite ) ఈ లీగ్‌ లో న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్నట్లు కనిపించింది.గ్రాండ్ కేమాన్ జాగ్వార్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్‌ను జోష్ లిటిల్ అవుట్ చేశాడు.ఇంతలో, కార్లోస్ బ్రైత్‌ వైట్ చాలా కోపంగా కనిపించాడు.

నిజానికి కార్లోస్ బ్రాత్‌వైట్ క్యాచ్ ఔట్ కాలేదు.బంతి అతని బ్యాట్‌కు తగలలేదు.

దాంతో కార్లోస్ చాలా కోపంగా డగౌట్ వైపు వెళ్లడం కనిపించింది.ఇంతలో, బ్రైత్‌ వైట్ కోపంతో అతని హెల్మెట్‌ను బ్యాట్‌తో కొట్టాడు.

అది నేరుగా బౌండరీ నుండి బయటకు వెళ్లింది.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!
మొదటిసారి బయటకు వచ్చిన పవన్ చిన్న కూతురు.. వైరల్

కార్లోస్ బ్రాత్‌వైట్‌ను తప్పుగా అవుట్ అయినా, అతని జట్టు మ్యాచ్‌లో విజయం సాధించగలిగింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ స్ట్రైకర్స్( New York Strikers) 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.ఇక కార్లోస్ బ్రైత్‌వైట్ 5 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Advertisement

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గ్రాండ్ కేమన్ జాగ్వార్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది.సూపర్ 3 రౌండ్‌లో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆది గెలిచారు.

దీంతో వారు ఫైనల్‌కు చేరుకున్నారు.ఇకపోతే కార్లోస్ బ్రైత్‌వైట్ విషయానికి వస్తే.

2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాడు కార్లోస్ బ్రాత్‌ వైట్.కార్లోస్ బ్రాత్‌ వైట్ ఫైనల్లో వరుసగా 4 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు.

కార్లోస్ బ్రాత్‌ వైట్ తన అంతర్జాతీయ కెరీర్‌లో వెస్టిండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు మరియు 41 టీ20లు ఆడాడు.ఈ సమయంలో అతను 1050 పరుగులు, 75 వికెట్లు సాధించాడు.

తాజా వార్తలు