ఆంధ్రప్రదేశ్ నందు ప్రతీ ప్రాణి ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చింది...జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ నందు ప్రతీ ప్రాణి ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చింది.ప్రస్తుత పరిస్థితి స్వాతంత్రోద్యమ కాలం నాటి రోజులు తలపిస్తోంది.

రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం కొరవడింది.చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం నందు ఆయన తిరగకూడదు అనడం ఏంటి?సీఎం వైఖరిని ప్రజలు కాదు కదా పక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదు.మీడియా హక్కులను కూడా హరిస్తారు , మీడియా వారు ఆలోచించుకోవాలి.

రోజురోజుకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తగ్గుతుంటే పోలీస్ వారు కండువాలు వేసుకొని కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.మునిసిపల్ ఛైర్మన్ గా సమావేశానికి ఆహ్వానం పంపించి ఉదయం 10:30 కి హౌస్ అరెస్ట్ అన్నారు ఎందుకో అర్థం కావడం లేదు.మార్చి నెలలోపు లోకల్ చానెళ్లను , యూట్యూబ్ చానెళ్ళను కూడా ప్రభుత్వం నియంత్రిస్తారు.

చంద్రబాబు ని చూస్తే భాదెసింది , మిమ్మలని రక్షించడానికే బాబు అవస్థ పడుతున్నారు.చెత్తబండ్లను కూడా పోలీసులే అడ్డుకుంటున్నారు , భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో మమ్మల్ని ఎత్తకండి అని ప్రతిఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం నేడు ఏర్పడింది.

Advertisement
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

తాజా వార్తలు