బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఆ ట్రాన్సాక్షన్ ద్వారా రూ.5 లక్షల వరకు బదిలీ..!

బ్యాంకింగ్ లావాదేవీల్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఐఎంపిఎస్ చాలా కీలకమైన చెల్లింపు వ్యవస్థ.

దీన్ని ఒక్క అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బు పంపించేందుకు ఉపయోగిస్తారు.

ఈ వ్యవస్థ సేవలు 24 గంటలు పనిచేసే విధంగా 2010లో తొలిసారి ప్రారంభించారు.అనంతరం ఈ వ్యవస్థను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు.2014 జనవరిలో ఐఎంపిఎస్ లావాదేవీల గరిష్ట పరిమితిని రెండు లక్షలుగా నిర్ణయించారు.అయితే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఆన్లైన్లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవల కు ఉపయోగించే ఐఎంపిఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది.అయితే ప్రస్తుతం ఐఎంపీఎస్ ద్వారా రెండు లక్షల వరకు బదిలీ చేసే పరిమితి ఉండగా, తాజాగా దీన్ని ఐదు లక్షలకు పెంచింది.

ఈ మేరకు ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement

" ఐఎంపిఎస్ సేవల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, వినియోగదారులకు మరింత సౌలభ్యకరమైన సేవలను అందించే దిశగా, ఈ లావాదేవీలపై ఉన్న పరిమితిని రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నాం" అని ద్వై మాసిక ద్రవ్య పరిమితి సమీక్ష నిర్ణయాలను శక్తి కాంతా దాస్ వెల్లడించారు.ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయని, వినియోగదారులకు సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.త్వరలోనే బ్యాంకులకు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి? దీన్ని ఎందు కోసం ఉపయోగిస్తారో తెలుసా..?

Advertisement

తాజా వార్తలు