తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు సేవలు రద్దు..?

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల( Tirumala )శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.నవంబర్ 19వ తేదీన తిరుమల శ్రీవారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరపనున్నారు.

ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ అర్చకులు నిర్వహించనున్నారు.అలాగే పుష్పయాగం రోజున దేవాలయంలో రెండో అర్చన, రెండో గంట నైవేద్యం అనంతరం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మల్లయప్ప స్వామి ఉత్సవాలు, సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వెంచెంపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

Important Note For Devotees Going To Tirumala Shrine Services Canceled On That D

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.అలాగే సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత దేవాలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి( Sri Malayappa Swamy ) వారు భక్తులకు దర్శనమిస్తారు.

ఇంకా చెప్పాలంటే శ్రీవారి పుష్ప యాగం కోసం నవంబర్ 18 వ తేదీన అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Important Note For Devotees Going To Tirumala Shrine Services Canceled On That D
Advertisement
Important Note For Devotees Going To Tirumala Shrine Services Canceled On That D

ఇందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanur Sree Padmavati Amma Varu )పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుంచి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున ఉదయం సుప్రభాతం తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.అలాగే నవంబర్ 19వ తేదీన పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దయ్యాయి.అంతే కాకుండా తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు.

దీని వల్ల నవంబర్ 19వ తేదీన శ్రీవారి సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు