ఏసుప్రభు ఉపదేశించిన ముఖ్యమైన శాంతి సందేశాలు ఇవే..!

మన భారత దేశంలో చాలా మతాలు ఉన్నా ప్రజలందరూ కలిసి మెలిసి ఎంతో సంతోషంగా ఉంటారు.

ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపు ఏదో ఒక ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు.

అలాగే ఈ భూమి పై ఉన్న ప్రతి ధర్మం మంచి చేయమని చెబుతుంది.కానీ ఎవరిని ఇబ్బంది పెట్టమని అస్సలు చెప్పదు.

అలాగే ఏసు ప్రభువు( Jesus Christ ) ప్రజలకు ఉపదేశించిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రభువు కొన్ని సందర్భాలలో మహా మౌనంగా ఉండేవారు.

అలాగే మాట్లాడకుండా చేష్టలతోనే గొప్ప సందేశాన్ని వినిపించేవారు.ఆయన పలికిన ప్రతి పలుకు కాంతిని ప్రసరించింది.

Advertisement

అలాగే శాంతిని( Peace ) ప్రకటించింది.సత్యాన్ని బోధించి, జీవ చైతన్యాన్ని కలిగించింది.ఇంకా చెప్పాలంటే ప్రభువు ఈ మాటలు కొత్త మార్గం వైపు ప్రయాణింపజేస్తాయి.

యేసు స్వయంగా చెప్పిన మాటలు మాత్రమే అనుసరణీయం అనుకోకూడదు.ఈ భూమి మీద 33 సంవత్సరాల పాటు సాగిన ఆయన జీవితమంతా పేదరికం, కష్ట నష్టాల పట్ల మౌనంగానే ఆయన అనేక సందేశాలు వినిపించారు.

యేసు చెప్పిన ప్రతి మాట సాక్షాత్తు ఆ పరలోకపు దేవుని మాటే అని ప్రజలు విశ్వసించారు.ఆ దివ్యత్వమే( Divinity ) ఒక మనిషిలా మరి అపార కృప ప్రవాహమై మన వద్దకు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు.

ఒకసారి శతాధిపతి ప్రభువు నా సేవకుడు పక్షవాతానికి గురై లేవలేక పోతున్నాడు అంటూ క్రీస్తు ముందు మోకరిల్లాడు.దాంతో యేసు సరే పదా అంటూ బయలుదేరారు.నేను పెద్ద ఉద్యోగినేని కావచ్చు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

కానీ మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించింతటి రాత నాకు లేదు.ఇక్కడి నుంచి మీరు ఓ మాట పలికితే చాలు ఆ సేవకుడు లేచి కూర్చుంటాడు అంటూ అతడు యేసు మాటకు ఎంత అద్భుత శక్తి ఉంటుందో నలుగురి ఎదుట చెప్పాడు.

Advertisement

అలా ప్రభు ఆశీర్వాదంతో సేవకుడి అనారోగ్య సమస్య దూరమై ఆరోగ్యవంతుడయ్యాడు.

తాజా వార్తలు