చంద్రబాబు కేసులపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై ఏపీ హైకోర్టులో కీలక విచారణలు జరగనున్నాయి.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

అదేవిధంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది.ఈ రెండు పిటిషన్లతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరగనుంది.

మూడు పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఏపీ హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement