Telangana Government : తెలంగాణలో ఈ నెల 27 లేదా 29న రెండు గ్యారెంటీల అమలు..!!

తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ నెల 27 లేదా 29న రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.ఈ క్రమంలోనే గృహలక్ష్మీతో( Gruhalakshmi Scheme ) పాటు రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించనుంది.

Implementation Of Two Guarantees In Telangana On 27th Or 29th Of This Month

ఈ నేపథ్యంలో ఈ హామీలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులు అందరికీ లబ్ధి చేకూరిలే చూడాలని అధికారులకు సూచించారు.మార్చి మొదటి వారం నుంచి గృహలక్ష్మీ పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారందరికీ పథకం వర్తింపజేయాలని తెలిపారు.

Advertisement
Implementation Of Two Guarantees In Telangana On 27th Or 29th Of This Month-Tel
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు