కాంగ్రెస్‎వి అమలుకు సాధ్యం కానీ హామీలు..: మంత్రి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదన్నారు.

పోరాడి సాధించుకున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ అవమానిస్తుందని మండిపడ్డారు.రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ కాలయాపన చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Implementation Of Congress Is Possible But Guarantees..: Minister Niranjan Reddy

ఈ కారణంగానే ఆత్మ బలిదానాలు జరిగాయన్నారు.ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇస్తుందని విమర్శలు చేశారు.

ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పదన్న మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు