కాంగ్రెస్ లోకి వలసల జోరు.. సీనియర్ల భయంతో కొత్త నేతల బేజారు !

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ( Telangana congress )లోకి వలసలు ఊపందుకున్నాయి.

బీఆర్ఎస్,( BRS )  బిజెపి( BJP )లోని అసంతృప్త నేతలు అంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా , కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని , గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వే రిపోర్టులతో చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు.

అయితే కొత్తగా పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తుండడం,  వారంతా కీలకమైన వారే కావడంతో,  కాంగ్రెస్ లోని సీనియర్ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.కొత్త నేతలు కారణంగా తమ టికెట్ కు ఎక్కడ గండిపడుతుందో అనే భయము వెంటాడుతుంది.

ఇక కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారం పై కొత్తగా పార్టీలో చేరే వారు అదే భయంతో ఉన్నారు.

Advertisement

అసలే తెలంగాణ కాంగ్రెస్ అంటే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.కాంగ్రెస్( Congress ) లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా,  ఎన్నికల సమయంలో ఈ తరహా రాజకీయం మొదలు కావడంతో, ఆ పార్టీలో ఆందోళన కలుగుతోంది.టికెట్ హామీ పొంది కాంగ్రెస్ లో చేరుతున్న నేతల్లో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉన్నారు.

తమకు టికెట్ రాకుండా కాంగ్రెస్ సీనియర్లు చక్రం తిప్పితే,  ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన కనిపిస్తోంది.ఇటీవల కాలంలో చాలామంది కీలక నాయకులే కాంగ్రెస్ లో చేరారు.

వారందరికీ టిక్కెట్ హామీని ఇచ్చారు.

మరి కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ ( Congress )లో చేరేందుకు సిద్ధమవుతున్నారు .తమతో పాటు తమ అనుచరులకు టిక్కెట్ ఇవ్వాలనే షరతులు విధించి మరీ కాంగ్రెస్ లో చేరుతున్నారు .దీంతో ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలు ఎటువంటి అభ్యంతరాలు పెడతారు ? తాము కోరినన్ని సీట్లు దక్కినా,  తమ ఓటమికి వారు కృషి చేస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన కొత్తగా చేరిన నేతల్లో కనిపిస్తోంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు