బాబా రాందేవ్ పై ఐ.ఎం.ఏ సీరియస్..!

కరోనాని కట్టడి చేయడంలో అల్లోపతి వైద్యం ఫెయిల్ అయ్యిందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కరోనా పాండమిక్ టైం లో రాత్రింబవళ్లు కష్టపడుతున్న డాక్టర్స్ ను అల్లోపతిని కించపరచేలా బాబా రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఐ.

ఎం.ఏ సీరియస్ అయ్యింది.బాబా రాందేవ్ వ్యాఖ్యలు దేశద్రోహం కింద పరిగణించాలని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ డిమాండ్ చేస్తుంది.

IMA Serious On Baba Ramdev Comments, Baba Ramdev , Baba Ramdev Corona , Comments

డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద ఆయనపై విచారణ జరపాలని కోరుతున్నారు.ఆధునిక వైద్య విధానం అల్లోపతి వైద్యంపై రాందేవ్ చేసిన కామెంట్స్ నేరపూరితమే అని ఐ.ఎం.ఏ అభిప్రయపడుతుంది.ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఐ.ఎం.ఏ పైన ఐ.ఎం.ఏ అధ్యక్షిడిపైన ద్వేషపూరిత దాడులుగా పరిగణించాలని అన్నారు.అల్లోపతిని కించపరచేలా ఆయన అన్ని మాటలు అంటున్నా కేంద్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోలేదని ఐ.ఎం.ఏ వెల్లడించింది.కరోనాకి ఎదురునిలిచి 1300 డాక్టర్లు ప్రాణత్యాగం చేశారని ఐ.ఎం.ఏ వివరించింది.ఈమేరకు రాందేవ్ పై యాక్షన్ తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది ఐ.ఎం.ఏ.రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలపై అల్లోపతి డాక్టర్లు ఫైర్ అవుతున్నారు.కరోనా టైం లో ఎంతో కష్టపడుతున్న తమ మీద ఇలాంటి మాటలు సరికాదని ఐ.

ఎం.ఏ అభిప్రాయపడ్డది.వెంటనే ఆయన మీద కేంద్రం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.

Advertisement
స‌మ్మ‌ర్ లో బాడీ హీట్‌ను మాయం చేస్తే సూప‌ర్ డ్రింక్స్ మీకోసం!

తాజా వార్తలు