అవును.. గెస్ట్‌ హౌస్‌కు వెళ్లా..!

గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో హీరోయిన్‌ ఇలియాన దర్శకుడు శంకర్‌ గెస్ట్‌ హౌస్‌కు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లింది అంటూ కథనాలు వస్తున్నాయి.

మొదట ఈ ప్రచారంలో నిజం లేదని అంతా భావించారు.

కాని అదే ప్రచారం జోరుగా రావడంతో అందరిలో అనుమానాలు రేకెత్తాయి.ఇలియానా సౌత్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సమయంలో శంకర్‌ను కలవడం వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా అనే కోణంలో పుకార్లు షికారు చేస్తూ వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై ఇలియానా క్లారిటీ ఇచ్చింది.తాను దర్శకుడు శంకర్‌ను ఆయన గెస్ట్‌ హౌస్‌లో కలిసినట్లుగా ఒప్పుకుంది.

దర్శకుడిని హీరోయిన్‌ ఆయన ఆఫీస్‌లో లేదా గెస్ట్‌ హౌస్‌లో కలవడం పెద్ద తప్పుగా నేను భావించడం లేదని, ఇందులో ఏదో వింత ఉన్నట్లుగా అంతా కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేసింది.తాను ఒంటరిగా శంకర్‌ను కలిసిన వార్త నిజం కాదని, నా డ్రైవర్‌ మరియు మేనేజర్‌తోనే నేను శంకర్‌ గారి గెస్ట్‌ హౌస్‌కు వెళ్లాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

బాలీవుడ్‌లో ఆఫర్లు లేని ఇలియానా ఎలాగైనా సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవ్వాలని చూస్తుంది.ఇది వరకు శంకర్‌ తెరకెక్కించిన ‘స్నేహితులు’ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.

శోభన్ బాబు పిలిచి హీరో అవకాశం ఇస్తే వద్దు అని చెప్పింది ఎవరో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు