Ileana : డెలివరీ తర్వాత అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇలియానా.. పోస్ట్ వైరల్!

ఇలియానా( Ileana ) పరిచయం అవసరం లేని పేరు.

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈ గోవా బ్యూటీ ఒకానొక సమయంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా( Star Heroine ) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఒకప్పుడు ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇక హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో ఈమె తన ప్రియుడిని పెళ్లి చేసుకొని తల్లిగా మారిపోయారు.గత ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకి జన్మనిచ్చినటువంటి ఇలియానా ప్రస్తుతం తన బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Ileana Health Issues After Delivery Viral Post

బాబు పనులలో పడి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ డెలివరీ తర్వాత తాను పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు.డెలివరీ (Delivery) తర్వాత ప్రతి ఒక్కరికి డిప్రెషన్ ( Depression ) అనేది సర్వసాధారణంగా ఉంటుంది.

Advertisement
Ileana Health Issues After Delivery Viral Post-Ileana : డెలివరీ �

అయితే నేను దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్యలు నన్ను వెంటాడుతున్నాయని వాటి నుంచి బయట పడటం కోసం ప్రతి రోజు వ్యాయామం( Exercise ) చేస్తున్నాను.

కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నానని ఆరోగ్యం పై తిరిగి శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నానని తెలియజేశారు.

Ileana Health Issues After Delivery Viral Post

నా కుటుంబం ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉంది.నేను కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను.ఇక తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చాలా రోజులైందని ప్రస్తుతం నేను తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉండటం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నానని తెలిపారు.

ఫోనిక్స్‌ ( Phonix ) నా జీవితంలోకి రావడం గొప్ప విషయం.తల్లిగా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలిపేందుకు ఈ ఫొటో పెడుతున్నాను అంటూ ఇలియానా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు