ఇలియానా అవన్ని పట్టంచుకోదట

గోవా బ్యూటి ఇలియానా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది.

రెండేళ్ళ గ్యాప్‌ తరువాత తీసిన రుస్తోమ్ వంద కోట్ల కలెక్షన్లతో మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో ఇల్లిబేబి వైపు మళ్ళీ చూస్తున్నారు బాలివుడ్ దర్శకనిర్మాతలు.

కొత్తగా, ఇటు సీనియర్ అజయ్ దెవగణ్ బాద్షాహోలో, అటు యువనటుడు అర్జున్ కపూర్ తో ముబారకాలో జోడికట్టబోతున్న ఇలియానా ఇప్పుడు ఎంతో ఉత్సాహావంతంగా, సంతోషంగా కనబడుతోంది.ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ నడుమందాల సుందరి.

ఇంటర్నెట్ అంటే అందరు మంచోళ్ళు ఉండరు కదా.ఏవేవో కామెంట్స్ పెడుతూ ఉంటారు.కొన్ని కామెంట్స్ చీప్ గా, వల్గర్ గా కూడా ఉంటాయి.

మరి వాటిని ఇలియానా ఎలా డీల్ చేస్తుంది? కోపం రాదా? ఈ ప్రశ్నలకి ఇల్లి బేబి జవాబు చాలా సింపుల్, అవేవి పట్టించుకోదంట అసలు."సోషల్ మీడియా ఎక్కువగా చెడునే చూపిస్తుంది.

Advertisement

ఎక్కువమంది నెగెటివ్ గానే మాట్లాడుతారు.నేను అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా.అలాంటప్పుడు అందరు మంచే మాట్లాడుతారని అనుకోవడం అమాయకత్వమే.నావరకైతే, నేను పెద్దగా పట్టించుకోను" అని చెప్పేసింది ఇలియానా! .

చిరంజీవి, కమల్ హాసన్.. ఒకరు సర్ ప్రైజ్ చేస్తే.. మరొకరు నిరాశ పరిచారు?
Advertisement