Ileana : ఫస్ట్ టైం బేబీ బంప్ తో కనిపించిన ఇలియానా.. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న పిక్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పే అలవాటు బాగా ఉంటుంది.ఎవరు ఏమనుకుంటారు అనే విషయాలు పట్టించుకోకుండా.

నేరుగా తాము గర్భం దాల్చిన విషయాలు చెబుతూ అందరికీ షాక్ ఇస్తారు.ఇప్పటికే చాలామంది టాలీవుడ్, బాలీవుడ్( Tollywood, Bollywood ) సెలబ్రిటీలు పెళ్లికి ముందే గర్భం దాల్చి షాక్ ఇవ్వగా.

రీసెంట్ గా ఇలియానా కూడా తను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.అయితే తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోను కూడా పంచుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఈ గోవా బ్యూటీ ఇలియానా( Ileana ).అప్పట్లో కుర్రాళ్ళ క్రష్ గా ఈ బ్యూటీ ఉండేది.ముఖ్యంగా తన నడుము అందాలతో అందర్నీ కట్టిపడేసింది.

Advertisement

అప్పట్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా బాగా చలామణి చేసింది.

కానీ ఆ హోదాను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.ఒక వ్యవహారం వల్ల టాలీవుడ్ లో తనకు అవకాశాలు లేకుండా చేశారు కొందరు దర్శక నిర్మాతలు.ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగా మళ్లీ కొంతకాలానికి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.

కానీ అంత సక్సెస్ కాలేకపోయింది.ఆ సమయంలో తను బాగా లావు అయ్యి కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక మళ్ళీ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయింది.అక్కడ కూడా అడపాదడపా అన్నట్లు మాత్రమే తన కెరీర్ సాగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బీచ్ లో సందడి చేసే ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఎక్కువగా తన బికినీ అందాలతో రచ్చ చేస్తుంది.

Advertisement

అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తను ప్రెగ్నెంట్ అంటూ ఒక హింట్ ఇచ్చి అందర్నీ షాకుకు గురి చేసింది.అందులో బేబీ టీ షర్ట్ తో పాటు.

మామా అనే లాకెట్ కూడా షేర్ చేసుకుంది.

అంతేకాకుండా అమ్మ అని పిలుపు కోసం అస్సలు ఆగలేను అని తన సంతోషాన్ని పంచుకుంది.దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని అందరికీ తెలియడంతో సెలబ్రిటీలంతా తనకు శుభాకాంక్షలు తెలిపారు.కానీ జనాలు మాత్రం ఆశ్చర్యం లో ఉన్నారు.

అయితే తాజాగా ఆమె ఒక స్టోరీ పంచుకోగా.అందులో తను వీడియో తీస్తూ కనిపించింది.

ఆ వీడియోలో తన బేబీ బంప్ క్లియర్( baby bump ) గా కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటో చూసి జనాలు మరింత ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకు తండ్రి ఎవరో చెప్పకుండా ఊరిస్తున్నావు అని అంటున్నారు.అయితే ఇలియానా గతంలో.

ఆండ్రూ నీబోన్( Andrew Kneebone ) అనే వ్యక్తితో ప్రేమాయణం నడపగా కొంతకాలానికే అతనితో బ్రేకప్ జరిగింది.అయితే రీసెంట్ గా ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాగా వార్తలు అయితే వినిపించాయి.

దీంతో కొందరు ఆ బిడ్డకు తండ్రి ఇతడే అని అనుమానం పడుతున్నారు.

https://instagram.com/stories/ileana_official/3094717005228493978?igshid=MDJmNzVkMjY=

తాజా వార్తలు