ఐఐటీ బాంబే అబ్బాయి.. ఢిల్లీ ఐఐటీ అమ్మాయి.. ఈ వింత వెడ్డింగ్ కార్డు చూశారా..?

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో విషయాలు వైరల్‌ గా మారుతూ ఉంటాయి.వినూత్నంగా ఉండే విషయాలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఒక పెళ్లి కార్డు( Wedding Card ) వైరల్ గా మారింది.జీవితంలో పెళ్లి అనేది ప్రతీఒక్కరికీ అతిపెద్ద మలుపు.

భాగస్వామి రాకతో జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.పెళ్లి చేసుకోవడంతో బాధ్యతలు మొదలవుతాయి.

అయితే పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతిఒక్కరూ ఆశ పడతారు.దీని కోసం రూ.లక్షల్లో డబ్బులు ఖర్చు చేశారు.మరికొంతమంది పెళ్లప్పుడు దర్పం ప్రదర్శిస్తారు.

Advertisement

ఇందుకోసం వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా, వింతగా తయారుచేయిస్తారు.అందులో భాగంగా తాజాగా ఒక వెడ్డింగ్ కార్డును విచిత్రంగా తయారుచేయించారు.

పెళ్లి పత్రికలో అమ్మాయి, అబ్బాయి పేర్లకు ముందు వారి ఇంటి పేరును ప్రింట్ చేయిస్తారు.ఇక కొంతమంది తమ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ను, మరికొంతమంది తామ ఉద్యోగం వివరాలను మెన్షన్ చేస్తారు.

అయితే ఒక జంట తమ పెళ్లి ఆహ్వాన పత్రికలో వరుడి, వధువు ఇంటి పేరు లేదు.అమ్మాయి, అబ్బాయి పేర్ల పక్కన వాళ్లు చదివిన యూనివర్సిటీ పేరు ఉంది.అబ్బాయి పేరు పక్కన ఐఐటీ బాంబే( IIT Bombay ) అని ఉండగా.

అమ్మాయి పేరు పక్కన ఐఐటీ ఢిల్లీ ( IIT Delhi ) అని ఉంది.ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.నెటిజన్లు అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

పెళ్లికి కావాల్సింది ప్రేమ మాత్రమేనని, కులమం కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

అలాగే కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.కొన్నేళ్ల క్రితం డిగ్రీ చదవడమే పెద్ద విషయమని, అందుకే ఆహ్వాన పత్రికల్లో విద్యార్హత పొందుపర్చేవారని చెప్పారు.ఇప్పట్లో డిగ్రీలు సాధారణమై పోయాయని చెప్పారు.

ఇక మరికొంతమంది అతడు తన ర్యాంక్ ను వెడ్డింగ్ కార్డులో పెట్టించడం మర్చిపోయాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.శాలరీ గురించి పెట్టడం మర్చిపోయాడని మరికొంతమంది తెలిపారు.

" autoplay>

తాజా వార్తలు