ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటి జోలికి అసలు వెళ్ళకూడదు...

మన శరీరం ఒక ఎముకల గూడు.

ఎందుకంటే మనం ప్రతిరోజు ఏ పని చేయాలన్నా కచ్చితంగా మన శరీరంలోని ఎముకల సాయం లేకుండా మనం ఏమి చేయలేము.

కనుక ప్రతి ఒక్కరూ ఎముకల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలి.ఇలా ఎముకలు ఆరోగ్యంగా ఉండడం వల్ల మనం ఎంతసేపు పనిచేసిన అలసిపోకుండా ఉండగలుగుతాము.

కానీ కొంతమంది తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారుతున్నాయి.చాలా మంది మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇంచుమించు ప్రతి రోజు మాంసాన్ని తీసుకుంటూ ఉంటారు.కాని మాంసం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాల్షియం యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది.

Advertisement
If You Want To Keep Your Bones Healthy, You Should Not Go For These, Bones Heal

దీంతో ఎముకల ఆరోగ్యం దెబ్బ తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.

If You Want To Keep Your Bones Healthy, You Should Not Go For These, Bones Heal

కాబట్టి అధికంగా మాంసం తీసుకోవడం మంచిది కాదు.మనం మాంసం తినేటప్పుడు మన శరీరానికి తగినంత మాత్రమే తింటూ ఉండాలి.కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది.

కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలహీన పరుస్తుంది అదే విధంగా జంతువుల నుండి వచ్చే ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం తగ్గుతుంది.కాబట్టి దాన్ని కూడా తగ్గించుకుంటూ ఉండాలి.

ఎక్కువ చక్కెర మరియు సాల్ట్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం తగ్గుతుంది.కెఫిన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

సరైన జీవన శైలిని అనుసరిస్తూ ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.రోజు వాకింగ్, రన్నింగ్ వంటి వాటిని అనుసరిస్తే మంచిది.

Advertisement

దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ఎండలో కాసేపు వాకింగ్ చేస్తే కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

తాజా వార్తలు