ఇకపై రైలులో అవి కావాలంటే భారీగా చెల్లించాల్సిందే..!

రైలు ప్రయాణికులకు ఒక విధంగా ఇది విచారించ దగిన విషయం అనే చెప్పాలి.

సాధరణ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు గాని ఏసీ కోచ్ లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే వారి జేబులకు చిల్లులు పడే వార్త అని చెప్పవచ్చు.

అదేంటంటే ఇకమీదట ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు బెడ్ రోల్స్ అంటే దుప్పట్లు, బెడ్ షీట్స్ కావాలంటే డబ్బులు భారీగా చెల్లించాలిసిందే అంటుంది రైల్వే శాఖ.అంటే ఈ బెడ్ రోల్స్ ను కూడా మూడు రకాల కిట్స్ గా ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నారు.ఈ కిట్స్ ధర కనిష్టంగా 30 రూపాయిల నుంచి మొదలయ్యి గరిష్టంగా 300 రూపాయిలు దాక ఉన్నాయి.

గతంలో కరోనా వైరస్ మొదటి వేవ్ ప్రారంభం నుంచి రైల్వే శాఖ ఇప్పటిదాకా ఏసీ కోచ్ లలో బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండు ఇవ్వడాన్ని ఆపివేసింది.ప్రయాణీకులే తమ వెంటే దుప్పట్లు, దిండ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.

కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో రైల్వే శాఖ మళ్ళీ బెడ్ రోల్స్ సౌకర్యాన్ని ప్రారంభించింది.అందులోను వచ్చేది శీతాకాలం కావటంతో ఏసీ లలో ప్రయాణించే వారికి బెడ్ షీట్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది కావున ప్రయాణీకులు కూడా బెడ్ రోల్స్ తీసుకుంటారని భావించిన రైల్వే శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

If You Want Them On The Train Anymore, You Have To Pay Heavily .. Train Travel,
Advertisement
If You Want Them On The Train Anymore, You Have To Pay Heavily ..! Train Travel,

ఇప్పటికే ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల స్టేషన్లలో అల్ట్రా-వైలెట్ బేస్డ్ లగేజ్ శానిటైజేషన్ మెషిన్లను ప్రారంభించింది.అలాగే మూడు రకాల కిట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ.మరి ఆ కిట్స్ లో ఏమేమి వస్తువులు ఉంటాయో చూద్దామా.మొదటి రకం కిట్ లో ఓ దుప్పటి, దిండు, బెడ్ షీట్, బ్యాగ్, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ సాచెట్, పేపర్ సబ్బు, టిష్యూ పేపర్ ఉంటాయి.

ఈ కిట్ ధర 300 రూపాయిలు.అలాగే రెండవ కిట్ లో దుప్పట్లు మాత్రమే ఉంటాయి.దీని ధర 150 రూపాయిలు.

ఇక మూడవ కిట్ లో టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్, పేపర్ సబ్బు, టిష్యూ ఉంటాయి.దీని ధర 30 రూపాయిలుగా నిర్ణయించారు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు