బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్( BRS ) మోసాన్ని గ్రహించి గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.

నాలుగు నెలల వ్యవధిలో వెయ్యి కోట్లు తెచ్చానని తెలిపారు.రూ.700 కోట్లతో నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) రాబోతుందని ఆయన చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు( Outer Ring Road ) సమీపంలో సుమారు రెండు వందల ఎకరాల్లో పది వేల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.

నీటి సమస్యకు బీఆర్ఎస్ పార్టీనే కారణమన్న మంత్రి కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు.మూడేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును( SLBC Project ) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు