Mustard oil : ఆవ నూనెలో ఇవి కలిపి జుట్టుకు రాశారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమ‌వ‌డం ఖాయం!

సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక జుట్టు సమస్య వేధిస్తూనే ఉంటుంది.

జుట్టు రాలడం, చుండ్రు( Hair loss, dandruff ), జుట్టు ఎదుగుదల లేకపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ఇలా రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే వీటన్నిటికీ చెక్‌ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు కనుక వాడారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( spoons fenugreek ) వేసుకోవాలి.

అలాగే అర కప్పు సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కలు మరియు రెండు స్పూన్లు అల్లం ముక్కలు( Ginger slices ) వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె పోసుకోవాలి.

Advertisement
If You Use This Oil All The Hair Problems Will Go Away-Mustard Oil : ఆవ న

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు నుంచి నాలుగు రెబ్బలు వేపాకు వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, మెంతులు, ఉసిరి మిశ్రమాన్ని కూడా వేసి గరిటెతో బాగా కలుపుతూ ఉడికించాలి.

If You Use This Oil All The Hair Problems Will Go Away

దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా చల్లారిన అనంతరం ఒక బాటిల్ లో ఆయిల్ ను నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.

If You Use This Oil All The Hair Problems Will Go Away

వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడితే అద్భుత లాభాలు మీ సొంతం అవుతాయి.ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ సమస్యకు చాలా త్వరగా చెక్ పెడుతుంది.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అలాగే ఈ ఆయిల్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది.

Advertisement

ఒకవేళ తెల్ల జుట్టు ఉన్న కూడా ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా వాడితే క్రమంగా నల్లబడుతుంది.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.

జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.

తాజా వార్తలు