పుచ్చ‌కాయ‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారట‌!

పుచ్చ‌కాయ‌. ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్ లో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే ఫ్రూట్స్‌లో ఇది ఒక‌టి.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ అమితంగా ఇష్ట‌ప‌డి తినే పుచ్చ‌కాయ‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి.

బ‌రువు త‌గ్గించ‌డంలోనూ పుచ్చ‌కాయ గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా పుచ్చ‌కాయ‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బ‌రువు త‌గ్గ‌డానికి పుచ్చ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక గిన్నెలో ప‌దిహేను జీడిప‌ప్పులు, క‌ప్పు వాట‌ర్ పోసి మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

Advertisement

అలాగే మ‌రో గిన్నెలో వ‌న్ టేబుల్ స్పూన్‌ స‌బ్జా గింజ‌లు, వాట‌ర్ పోసి నాన బెట్టుకోవాలి.మ‌రోవైపు పుచ్చ‌కాయ తీసుకుని తొక్క తొల‌గించి చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన బెట్టుకున్న జీడిప‌ప్పులు, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, రెండు క‌ప్పుల వాట‌ర్ వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్‌లో క‌ట్ చేసుకున్న పుచ్చ‌కాయ ముక్క‌లు, నాన బెట్టుకున్న స‌బ్జా గింజ‌లు వేసి బాగా క‌లిపి అర గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఆపై ఈ పుచ్చ‌కాయ మిల్క్ షేక్‌ను సేవించాలి.దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అతి ఆక‌లి త‌గ్గుతుంది.

ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దాంతో చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు, ఈ హెల్తీ పుచ్చ‌కాయ మిల్క్ షేక్‌ను డైట్‌లో చేర్చుకుంటే నీర‌సం, అల‌స‌ట‌కు దూరంగా ఉండొచ్చు.

Advertisement

శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.మ‌రియు వ‌డ దెబ్బ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

తాజా వార్తలు