వంటగది విషయంలో ఈ పొరపాట్లను చేస్తే.. కష్టాలు తప్పవు..!

ఒక వ్యక్తి జీవితాన్ని సక్రమంగా నడిపించడంలో వాస్తు కీలకపాత్ర పోషిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఇంట్లోనీ వంట గదిలో ప్రత్యేకంగా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.వంటగది దిశ సరిగా ఉంటే ఆనందం, శ్రేయస్సు వస్తుంది.

ఇంకా చెప్పాలంటే వంట గది పొరపాటున కూడా తప్పు దిశలో ఉండకూడదు.అది పేదరికనికి దారితీస్తుంది.

వంట గది( kitchen ) లోపల వస్తువులను కూడా తప్పుగా అమర్చకూడదు.

Advertisement

అది కూడా మీ జీవితం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.అందుకే పండగది నిర్మాణం అందులో ఏర్పాటు చేసే వస్తువుల విషయంలోనూ వాస్తు సరిగ్గా పాటించాలి.వంటగదికి సంబంధించిన వాస్తు దోషాలు ఏంటి, ఏవి సమస్యలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు.

అందుకే వంటగదిని ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి.స్టవ్ పొరపాటున కూడా డోర్ దగ్గర కానీ, పక్కన కానీ ఉండకుండా చూసుకోవాలి.వంట గదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశలో ఉంచకూడదు.

అది ఎంతో హాని కలుగజేస్తుంది.వంటగదిలో గ్యాస్ స్టవ్( Gas stove ) ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్18, శుక్రవారం 2024

అలాగే స్టవ్ మురికిగా ఉంటే అన్నపూర్ణ దేవి( Annapurna Devi )కి ఆగ్రహం వస్తుంది.ఇంటి కిచెన్ మెట్ల క్రింద నిర్మించకూడదు.

Advertisement

అలాగే వంటగది బాత్రూం పక్కన ఉండకుండా చూసుకోవాలి.ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావాన్ని చెబుతుంది.

ఇంకా చెప్పాలంటే వంటగదిలో వంట చేసిన తర్వాత పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.పాత్రలను మురికిగా ఉంచడం అశుభంగా పెద్దవారు చెబుతూ ఉంటారు.

దీంతో ఇంట్లో గొడవలు జరగడంతో పాటు ధన నష్టం కూడా జరుగుతుంది.వంటగదిలో అద్దం ఉంచినట్లయితే వెంటనే తొలగించాలి.

వంటగదిలో అద్దం ఉండడం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని ప్రజలను నమ్ముతారు.దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలిగే అవకాశం కూడా ఉంది.

తాజా వార్తలు