మార్గశిర మాసంలో వారాహి దేవికి పంచముఖ దీపం వెలిగిస్తే ఇన్ని దోషాలు దూరం అవుతాయా..

మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించిన వారు స్వామికి సమర్పించే ప్రతి తులసి ఆకుకి ప్రతి అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుంది.

కార్తీకమాసంలో దీపా దానం చేసే వారికి బ్రహ్మహత్యా ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి.

మార్గశిర మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇంటి ముందర దీపం వెలిగిస్తే ఇంటి పై లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.మార్గశిర మాసంలో మహా విష్ణువుకు ఆవు నేతితో దీపం వెలిగించి విష్ణు సహస్ర నామం భగవద్గీత పారాయణం చేయడం ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

మార్గశిర మాసంలో గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి.మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు నిలువుగా భావిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని, దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలామంది ప్రజలు భావిస్తారు.

Advertisement

జయంతి అంటే భగవద్గీత ను కృష్ణుడు ప్రబోధించాడని పురాణాలు చెబుతున్నాయి.అంతే కాకుండా మార్గశిర పంచమి రోజున వరాహి దేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి, ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా దూరమవుతాయని చాలా మంది ప్రజలు భావిస్తారు.ఇంకా చెప్పాలంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉంటారని వేద పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా వారాహి దేవికి పంచముఖ దీపాన్ని నేతి తో వెలిగించడం ఎంతో మంచిది.పంచమి రోజున సాయంత్రం ఇలా చేస్తే సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు