వైరల్ వీడియో: చేపల కోసమని గాలం వేస్తే.. చివరికి..?!

సమయం దొరికినప్పుడల్లా చాలా మంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు.

కొంతమంది పుస్తక పఠనం చేస్తే మరి కొంతమంది టైమ్ పాస్ అవ్వడానికి సరదాగా చేపలు పట్టడానికి రెడీ అయిపోతారు.

చేపలు పట్టడం అంటే వల వేసి పట్టడం కాదండయా.మనం చిన్నప్పుడు ఒక కర్రకు కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి నీటిలో వదులుతాము గుర్తుందా.

ఆ ఎరను పట్టుకోవడానికి చేపలు వచ్చి గాలానికి చుక్కుకుంటాయి.అప్పుడు కర్రను పైకి లాగి గాలానికి ఉన్న చేపను తీసేసి మళ్ళీ ఎరను పెట్టి చేపలు పడతాము.

చేపలను పట్టడానికి ఎరలను ఎర వేస్తున్నాము అన్నమాట.ఇప్పుడు ఈ గోల అంతా ఏంటి అని అనుకుంటున్నారా.

Advertisement

ఇలా చేపలు పట్టడానికి ఒక వ్యక్తి నీటిలోకి ఎరని కట్టి వదలగా చేప బదులుగా మరోక జీవి చిక్కుకుంది .ఇలా ఊహించని పరిణామంతో అతను అవాక్ అయ్యాడు.ఈ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోను చుసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యంలో ఉండిపోయారు.కాలువలలో, చెరువులలో అలాగే నదులలో చేపలతో పాటు పాములు ఉండడం కూడా సహజమే కదా.అయితే ఆ వ్యక్తి చేపలకు ఎర వేస్తే ఏకంగా పాము చిక్కింది.పాములను దూరం నుంచి చూస్తేనే చాలా బయపడిపోతూ ఉంటాము కదా.

అలాంటిది దగ్గర నుండి చూస్తే గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదా.సరిగ్గా ఆ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది.వీడియోలో చూసినట్టు చేపల కోసం ఓ వ్యక్తి నీటిలోకి గాలాన్ని వేయగా చేపలకు బదులు పాము చిక్కింది.

ఆ పాము గాలం నుంచి తప్పించుకోవడానికి పాపం గిల గిల మంటూ కొట్టుకుంది.ఆ పాముని కాపాడడానికి మరొక పాము కూడా బయటికి వచ్చింది.రెండు పాములను ఒకేసారి చూసే సరికి ఎవరికన్నా భయం వేస్తుంది కదా.ఇంకా నయం ఆ వ్యక్తి చేప పడింది కాబోలు అనుకుని చూడకుండా పైకి లాగలేదు అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు